‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లో బిగ్ బ్రేక్ అందుకుని కుర్రకారుకు దగ్గరైంది. పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ హిట్ ప్రభావంతో నభా ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అదీగాక ఈ భామ అందాల ఆరబోత కూడా మామూలుగా ఉండదు. ఆ ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకొని ఫ్యాన్ బేస్ బాగానే సంపాదించుకుంది.
ఇక నభా ఇస్మార్ట్ అందాలన్నీ చూశాక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. నభా ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు పెడుతుందా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నభాకి కావాల్సిన బిగ్ బ్రేక్ మళ్లీ లభించలేదు. వరుసగా కుర్రహీరోల సరసన సినిమాలు చేసింది కానీ హిట్స్ మాత్రం పడలేదు. కానీ అమ్మడికి మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో నటించాలని ఉందంటూ పలు సందర్భాలలో మనసులో మాట బయటపెట్టింది.
ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నపుడే అందాలను విరివిగా చూపించేసింది నభా. దాంతో నెట్టింట ఎప్పుడూ ఫొటోస్ పెట్టినా మినిమమ్ గ్యారెంటీ అన్నట్లుగా గ్లామర్ షో చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటోంది. తాజాగా నభా కొత్త కొత్త పోజులతో ఇన్ స్టాగ్రామ్ లో పిచ్చెక్కించింది. నభా మాస్ అందాల ఆరబోత ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి నభా లేటెస్ట్ గ్లామర్ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.