హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ ప్రియమణి కలయికలో వచ్చిన చిత్రం నారప్ప. జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మలయాళ సినిమా అసురన్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ నటనకు విమర్శకుల నుంచి ప్రసంశలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్‌లో నారప్ప సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
ఈ వేడుకలో ప్రియమణి మాట్లాడుతూ.. శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో మొదటి సారి నటించానని, లుక్ టెస్ట్ చేసిన తరువాత ఈ పాత్ర మీరే చేస్తారు అని ఆయన చెప్పగానే నాకు చాలా సంతోషం కలిగింది అని అన్నారు. ఇక నేను మొట్టమొదటగా పెళ్లైన కొత్తలో అనే సినిమాలో నటించాను. ఆ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగింది. అప్పట్లో ఆ స్టూడియోలో చాలా మంది హీరోయిన్స్ ఫోటోలను చూశాను.
ఎందుకు అలా వారి ఫోటోస్ పెట్టారు అని అడిగితే.. సురేశ్ ప్రొడక్షన్స్ లో నటించిన ప్రతీ హీరోయిన్ల ఫొటోలు అలాగే పెడతారని చెప్పారు. దీంతో నేను అప్పుడే అనుకున్నా.. ఎలాగైనా నా ఫోటో కూడా అక్కడ ఉండాలని. ఇక వెంకటేష్ గారితో సినిమా చేయాలని ఎప్పుడి నుంచో అనుకునే దాన్ని. చివరికి ఆ కోరిక నారప్ప సినిమాతో తీరిందని తెలిపింది. దీంతో ఆ స్టూడియోలో నా ఫోటో ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ..అలా అనుకునే దానిని అని ప్రియమణి తెలిపింది.