ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కి వెళ్లడం, అరిచి గోల చేయడం.. ఇలా చాలా సందడి ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగింది, ట్రెండ్ మారిపోయింది. కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. అప్పటివరకు సినిమాలు, అది కూడా భారతీయ సినిమాలే చూస్తూ వచ్చిన వారు కాస్త ప్రపంచంలోని చాలా భాషల సినిమాలు చూడటానికి అలవాటుపడ్డారు. అలానే వెబ్ సిరీస్ లు, స్టాండప్ కామెడీ షోలు చూడటం బాగా అలవాటు చేసుకున్నారు. ఈ స్టాండప్ కామెడీ కల్చర్ కూడా నగరాల్లో బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆ షోలు చేసే ఓ కమెడియన్ పై పోలీసులు కేసు నమోదు చేయడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీతో 2010 అక్టోబరులో ఓ స్టాండప్ కామెడీ షో నిర్మించేందుకు ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ అది సెట్ కాలేదు. కానీ ఇది జరిగిన పదేళ్లకు అంటే 2020లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వీర్ దాస్ చేసిన ఓ షో ప్రోమో రిలీజైంది. దీన్ని చూసిన అశ్విన్ షాకయ్యారు. తను అనుకున్న షో నుంచి కొన్ని మార్పులు చేసి, కాపీ కొట్టారని ఆయన ఆరోపించారు. కాపీరైట్ ఉల్లంఘించారని నిర్మాత అశ్విన్.. ముంబయి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నవంబరు 4న కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, కేసు దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఇకపోతే స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ తోపాటు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంపై కూడా ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వీర్ దాస్ షోల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, మన దేశాన్ని ప్రపంచం చెడుగా చూస్తోందని ఆరోపిస్తూ హిందూ జనజాగృతి సమితి కూడా బెంగళూరు పోలీసులను సోమవారం ఆశ్రయించింది. గతేడాది కూడా కమెడియన్ వీర్ దాస్ పై పలువురు పోలీసు ఫిర్యాదు చేశారు. అయితే తన కామెంట్స్ దేశాన్ని ఏ రీతిలోనూ అవమానించేలా లేవని వీర్ దాస్ ఓ నోట్ విడుదల చేశాడు. ఏదైతేనేం ఇప్పుడు వీర్ దాస్ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
This is no joke @thevirdas pic.twitter.com/8CFdDYShDs
— Rajesh Gehani 🇮🇳 (@rrgehani) November 8, 2022
#Hindujanajagruti has filed a complaint against actor & comedian @thevirdas with Vyalikaval cops to show his show on #Bengaluru #Karnataka on Nov 10. Alleging he insults #Hindu faith in his comedy shows. They want his show to be cancelled. pic.twitter.com/9TTMrMLRHc
— Imran Khan (@KeypadGuerilla) November 7, 2022