మెహ్రీన్ కౌర్ పిర్జాదా.. కృష్ణ గాడి వీర ప్రేమా గాధ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ. మొదటి సినిమాతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెహ్రీన్ ప్రేక్షకుల మనసు దోచేసింది. దీంతో.., ఈ అమ్మడికి తెలుగునాట లాంగ్ రన్ సాధించడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ.., కొన్ని ప్లాప్స్, కొన్ని హిట్స్ మధ్య మెహ్రీన్ అతి కష్టం మీద కెరీర్ ని రన్ చేసుకుంటూ వచ్చింది. ‘ఎఫ్-2’ ఇచ్చిన సక్సెస్ కిక్ లోనే ఈ అమ్మడు అందరికీ షాక్ ఇస్తూ పెళ్ళికి సిద్ధమైపోయింది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. కానీ.., కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడింది.
ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. తాజాగా మెహ్రీన్ ఈ పెళ్లిని పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇకపై భవ్య బిషోని కి, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా వ్యక్తిగతం. అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నా. ఇకపై నా కెరీర్ ని ఇలానే కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది మెహ్రీన్. దీంతో.., ప్రస్తుతం మెహ్రీన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021
మెహ్రీన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ స్టార్ హీరో కారణమన్న టాక్ మాత్రం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. కెరీర్ విషయంలో సెకండ్ ఛాన్స్ తీసుకోవద్దని, ఆ స్టార్ హీరో తన సినిమాలో అవకాశం ఇచ్చినందుకే మెహ్రీన్ పెళ్లిపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే మెహ్రీన్ నోరు విప్పాల్సిందే.