సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన పవర్ స్టార్ చిత్రం “భీమ్లా నాయక్” శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు భీమ్లా నాయక్ మంచి హిట్ టాక్ తెచ్చుకుని రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తోంది. పవన్ కళ్యాణ్‌కు సరైన కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది భీమ్లా నాయక్ చిత్రం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించింది ఈ చిత్రం. ఇక ఈ సినిమాలో పవన్, రానాల నటనతో పాటు థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ మాటలు, సాగర్ డైరెక్షన్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి భీమ్లా నాయక్ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. రానా, పవన్ కళ్యాణ్ తో షూటింగ్ సమయంలో మెగాస్టార్ దిగిన ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి..”భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందకు నా హృదయపూర్వక అభినందనలు. నిజంగా ఇది పవర్ తుఫానే..” అంటూ చిరు రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
మలయాళంలో వచ్చిన “అయ్యప్పనుమ్ కోషియం”కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో పవర్ స్టార్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేశారు. ఈ సినిమాలో పవన్, రానా మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నటించిన నిత్యా మీనన్, రానా సరసన నటించిన సయుంక్త మీనన్ కూడా తమ నటనతో మంచి మార్కులు కొట్టేశారు. మరి.. చిరు చేసిన ట్విట్టర్ పోస్ట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Heartiest Congratulations on the Thumping Success of #BheemlaNayak True Power Storm! 👏👏👏@PawanKalyan #Trivikram @RanaDaggubati @saagar_chandrak@MusicThaman @MenenNithya @iamsamyuktha_ @dop007 @NavinNooli @SitharaEnts pic.twitter.com/a0U1hs8zGV
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 25, 2022