టాలీవుడ్ లో ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. దాసరి నారాయణరావు మృతి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనేది దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదటి నుంచి ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవినే భర్తీ చేయగలరు అంటూ ఎందరో తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. మా ఎన్నికల సమయంలో ఆ స్థానాన్ని మోహన్ బాబు తీసుకుంటే బావుంటుందని ఆయన వర్గం వారు వ్యాఖ్యానించారు. తాజాగా సినీ కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి పెద్దరికం అంశంపై ఓపెన్ కామెంట్స్ చేశారు.
ఇండస్ట్రీ పెద్దగా ఉండటం తనకు ససేమిరా ఇష్టం లేదని కుండ బద్దలు కొట్టేశారు. ‘పెద్దరికం అనేది ఒక హోదాగానో, పదవిగానో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా ఉండను. కానీ, బాధ్యతగల ఒక బిడ్డగా ఉంటాను. రెండు యూనియన్లు, ఇద్దరు వక్యుల గొడవలకు పంచాయితీలు చేయమంటే నాకు నచ్చదు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది’ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.