వినాయక చవితి సందర్భంగా ప్రముఖ గాయని మంగ్లీ గణపతిపై మరో పాటను ఆమె య్యూటూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఇప్పటికే 1.7 మిలియన్ వీవ్స్ తో ట్రెడింగ్లో దూసుకుపోతుంది. పాటలో మట్టి గణపతికి ప్రాధాన్యతనుగురించి చెప్పారు. అంతేకాదు ఎప్పటిలాగానే పచ్చటి ప్రకతి, పల్లె వాతావరణాన్ని హైలైట్ చేయడం బాగుంది. దాంతో పాటు సంగీతానికి తగ్గట్టు డాన్స్ కూడా ఇరగదీశారు. దీంతో అభిమానులు చాలా సంతోషం వ్యక‍్తం చేశారు. రచయిత లక్క్ష్మణ్ ఈ గీతాన్ని రాయగా, సురేష బొబ్బులి సంగీతంలో మంగ్లీ, మరికొంతమంది బాల గాయకులు ఈ గీతాన్ని ఆలపించారు. వినాయక చవిత సందర్భంగా గతంలో మంగ్లీ పాడిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.