తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు కొద్దిమంది మాత్రమే సత్తా చాటుకున్నారు. అలాంటి హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పరుశరామ్ దర్శకత్వంలో సూపరప్ స్టార్ మహేష్ బాబు, అందాల భామ కీర్తి సరేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ ప్రపంచ వ్యాప్తంగా మే 12, 2022న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటి వరకు ఏ మూవీకీ చేయని విధంగా ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ బిజీగా ఉన్నారు మహేష్ బాబు.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు యాడ్స్ లో బిజీగా ఉంటున్నారు మహేష్ బాబు. ఇప్పటి వరకు మహేష్ బాబు పలు మ్యాగజైన్ కవర్ లో ఆయన ఫోటోలు ప్రచురించిన విషయం తెలిసిందే.. ఫేమస్ మ్యాగజైన్ ద పికాక్ కవర్ పేజీపై మహేష్ బాబు స్టైలిష్ లుక్ తో ఒక ఫోటో ప్రచురించారు. ఈ ఫోటోలో మహేష్ బాబు డ్రెస్, హెయిర్ స్టైల్ లుక్ అదిరిపోయింది. మహేష్ బాబు స్వయంగా సోషల్ మాద్యం వేధికగా ఈ ఫోటో పోస్ట్ చేశారు. మ్యాగజైన్ కవర్ పేజి పై మహేష్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
ఈ సందర్భంగా ఆయన తన ఫోటోని మేగజీన్ కవర్ పేజీపై ప్రచురించినందుకు ద పీకాక్ మేగజీన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫోటో షూట్ లో తనకు అన్ని విధాలుగా సహకరించి.. తనని ఇంత స్టైలిష్ లుక్ గా తీర్చిదిద్దిన మేగజీన్ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్‌లకు కూడా మహేశ్ బాబు థ్యాంక్స్ చెప్పారు. ఇక మహేష్ స్టైలిష్ లుక్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Humbled and honoured to be starring on the cover of #ThePeacockMagazine. The shoot and the overall experience was so much fun! Thank you @falgunipeacock and @shanepeacock. Here’s to many more! 🤗 pic.twitter.com/pbaoVkcc4f
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2022