మరో నెల రోజుల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా మేనమామ అల్లు అరవింద్ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు సినిమా అంటే ఒకప్పుడు చిన్నచూపు చూసేవారు. ఇప్పుడది ఆకాశమంత రేంజ్ కి వెళ్లిపోయింది. ‘బాహుబలి’తో మొదలైన ఈ ట్రెండ్.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ వరకు వెళ్లిపోయింది. ఇలా మన హీరోలు కూడా వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయారు. ఇక ఆయా హీరోల పుట్టినరోజు సందర్భంగా గతంలో కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఆకట్టుకునేవారు. కానీ గత ఏడాది కాలంలో అది పోయి కొత్త ట్రెండ్ వచ్చింది. అదే పాత హిట్ సినిమాల్ని రీ రిలీజ్ చేయడం.. ఇప్పుడు ఆ ట్రెండ్ లో భాగంగానే చరణ్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్ రెడీ అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవిది తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఫస్ట్ మూవీతోనే తన మార్క్ చూపించారు. ఇక రెండో చిత్రం ‘మగధీర’.. అప్పటి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. చరణ్ యాక్టింగ్ పవర్ అంటే ఏంటో కూడా చూపించింది. ఆ తర్వాత వరసగా కమర్షియల్ మూవీస్ చేస్తూ వచ్చిన చరణ్.. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా హిట్ కొట్టి పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇక మార్చి 27న చరణ్ పుట్టినరోజు. దీనికోసం ఆల్రెడీ ఫ్యాన్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. సెలబ్రేషన్స్ గట్టిగా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్ ని డబుల్ చేసేందుకు అల్లు అరవింద్ అరవింద్ అదిరిపోయే గిఫ్ట్ తో వచ్చేశారు. ‘మగధీర’ సినిమాను ఆ రోజు థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన సినిమాలన్నీ విశేషాదరణ సొంతం చేసుకుంటున్నాయి. మరి ‘మగధీర’ ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుందనేది చూడాలి. మరి ‘మగధీర’ రీ రిలీజ్ కు మీలో ఎంతమంది వెళ్తారు? కింద కామెంట్ చేయండి.
On the occasion of 𝐌𝐄𝐆𝐀 𝐏𝐎𝐖𝐄𝐑𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan Birthday! 😎
Re-Releasing the Sensational 𝐈𝐍𝐃𝐔𝐒𝐓𝐑𝐘 𝐇𝐈𝐓 #Magadheera in theaters 🔥#MagadheeraReRelease 💥@ssrajamouli @MsKajalAggarwal @mmkeeravaani #AlluAravind @BvsnP @DOPSenthilKumar @GeethaArts pic.twitter.com/aENWnSn23a
— Geetha Arts (@GeethaArts) February 23, 2023