హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు మొత్తం భారత పురాణాల ఆధారంగా తెరకెక్కాయి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సూపర్ మ్యాన్‌తో పాటు చాలా పాత్రలు మన పురాణాల నుంచి పుట్టినవే..
దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు మొత్తం రాముడు, హనుమంతుడి నామాలతో మారుమోగిపోయాయి. ఇక, ప్రతీ థియేటర్లో హనుమంతుడి కోసం ఓ సీటును సైతం కేటాయించారు. రాముడు ఉన్న చోట హనుమంతుడు కచ్చితంగా ఉంటాడని, థియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీటు కేటాయించాలని దర్శకుడు కోరాడు. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో ఓ సీటు కేటాయించటంతో పాటు కొన్ని చోట్ల ఆ సీటులో హనుమంతుడి ఫొటోలు పెట్టి పూజలు కూడా చేశారు. అంతేకాదు! హనుమంతుడి సీటులో కూర్చున్న వారిపై తోటి ప్రేక్షకులు దాడులు చేసిన సంఘటనలు కూడా దేశ వ్యాప్తంగా చాలా జరిగాయి.
ఇలా దేశ వ్యాప్తంగా హనుమంతుడి మేనియా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో రామ భక్తుడికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలో హనుమాన్ జీ దర్శనం ఇచ్చారు. అయితే, పాత్ర రూపంలో కాదు.. పోస్టర్ రూపంలో ఇంతకీ సంగతేంటంటే.. హాలీవుడ్లో ‘ది ప్లాష్’ పేరుతో ఓ సూపర్ హీరో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోకు ఆంజనేయ స్వామి అంటే ఎంతో ఇష్టం.
అందుకే.. తన ఇంట్లో ఆంజనేయ స్వామి ఫొటో పెట్టుకుని ఉంటాడు. ఓ రెండు, మూడు సీన్లలో హనుమంతుడి ఫొటో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ సీన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో హనుమంతుడి భక్తులు సంతోషంలో మునిగితేలుతున్నారు. మరి, హాలీవుడ్ సినిమాలో హనుమంతుడి రిఫరెన్స్ ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.