ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఇండియా నుండి ఆస్కార్ బరిలో పోటీపడుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నుండి 'నాటు నాటు' సాంగ్ ఎంపిక అవ్వడంతో భారతీయులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 12న(మార్చి 13న ఇండియన్ టైంలో) అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగబోతుంది. ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు.. రేపు ఆస్కార్ లో ఎలాంటి రచ్చ చేయనుందోననే కుతూహలం కూడా నెలకొంది.
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఇండియా నుండి ఆస్కార్ బరిలో పోటీపడుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నుండి ‘నాటు నాటు‘ సాంగ్ ఎంపిక అవ్వడంతో భారతీయులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 12న(మార్చి 13న ఇండియన్ టైంలో) అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగబోతుంది. సో.. ఆర్ఆర్ఆర్ కి తప్పకుండా ఆస్కార్ రావాలని కోట్లాది భారతీయ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ సైతం కోరుకుంటున్నారు. ఓవైపు నాటు నాటుకి ఆస్కార్ ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. ఇన్ని అంచనాలు, ఆశల మధ్య.. ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు.. రేపు ఆస్కార్ లో ఎలాంటి రచ్చ చేయనుందోననే కుతూహలం కూడా నెలకొంది.
మరి నాటు నాటు సంగతి ఏంటనేది తెలియాలంటే.. రేపటిదాకా ఆగాల్సిందే. అయితే.. నాటు నాటుకి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. దానికి పోటీగా నిలిచిన సాంగ్స్ కూడా ప్రపంచాన్ని ఊపేశాయని అంటున్నారు. ప్రెజెంట్ ఆస్కార్ కి పోటీగా నిలిచిన సాంగ్స్ చూసుకుంటే.. అప్లాజ్(టెల్ ఇట్ లైక్ ఏ విమెన్), హోల్డ్ మై హ్యాండ్(టాప్ గన్ మావరిక్), లిఫ్ట్ మీ అప్(బ్లాక్ పాంథర్ వాకాండ), దిస్ ఈజ్ లైఫ్(ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఎట్ వన్స్).. సాంగ్స్ కలిసి ‘నాటు నాటు’కి గట్టిపోటీ ఇస్తున్నాయి. కాగా.. ఇందులో కూడా మూడు సాంగ్స్ మినహాయించి.. బ్లాక్ పాంథర్ వాకాండ ఫరెవర్ నుండి ‘లిఫ్ట్ మీ అప్’ సాంగ్ మాత్రం నాటు నాటుపై అనుమానాలు క్రియేట్ చేస్తోందని అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ నుండి నాటు సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది. అది ఓకే. కానీ.. ఈ ‘లిఫ్ట్ మీ అప్’ సాంగ్ ప్రత్యేకత ఏంటి? నాటు నాటు విన్నింగ్ పై అనుమానాలు పెంచేంత ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ పాటను బార్బేరియన్ సింగర్ రిహానా ఆలపించింది. వరల్డ్ వైడ్ ఎంతో పాపులర్ అయిన రిహానా పాడిన ఈ పాటను.. బ్లాక్ పాంథర్ స్టార్ చాడ్విక్ బోస్ మెన్ కి నివాళిగా రూపొందించారు మేకర్స్. అప్పటినుండి ఈ పాటను అమెరికన్స్ సెంటిమెంట్ గా భావిస్తున్నారట. అదీగాక పలు అంతర్జాతీయ వేదికలపై కూడా రిహానా.. లిఫ్ట్ మీ అప్ సాంగ్ ని ప్రమోట్ చేసింది. ఆస్కార్ బరిలో నిలిచాక.. ఈ సాంగ్ ప్రమోషన్స్ ఇంకా పెరిగిపోయాయి. అయితే.. ఆస్కార్ నాటు నాటుకే వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నా.. లిఫ్ట్ మీ అప్ సాంగ్ కూడా రేసులో గట్టిపోటీ ఇస్తోందని టాక్ నడుస్తోంది. సో.. ఈ రెండు పాటలలో ఏదోకటి ఖచ్చితంగా ఆస్కార్ కొడుతుందని అంటున్నారు.. మరి నాటు నాటునే కొడితే బాగుంటుందని ఇండియన్స్ భావన. మరి నాటు నాటు – లిఫ్ట్ మీ అప్ సాంగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.