దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ పీరియాడిక్ మూవీ మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR మూవీ కోసం ఇటు సామాన్య అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాలకు సంబంధించిన విషయాలకు ఎప్పుడు దూరంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి కోడలు..రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. RRR కోసం ఎంతో ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. వారణాసిలో RRR కి సంబంధించిన వీడియో ఒకటి ఉపాసన పోస్టు చేసింది. Super excited for #RRRMoive అంటూ ట్వీట్టర్ లో ఆ వీడియోను షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
VaRRRnasi ur were magical as always 🤗⭐️🙏
Super excited for #RRRMoive #RRR @AlwaysRamCharan pic.twitter.com/xzR57CwCLV— Upasana Konidela (@upasanakonidela) March 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.