కళ్లకు గంతలు కట్టుకుని సైకిల్ రైడ్ పర్ఫెక్ట్‌గా చేస్తుంది ఓ 14 ఏళ్ల బాలిక. మనం ధరించే దుస్తుల రంగులు, కరెన్సీ నోట్లు కళ్లకు గంతలతోనే అతి సులభంగా గుర్తిస్తుంది. వస్తువలను అనుభూతి చెంది గుర్తిస్తానని రియా తెలిపింది. యోగా, మెడిటేషన్ తో ఇలా చేయడం సాధ్యమైందని తెలిపింది.
ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు చాలా తెలివితేటలు కలిగి ఉంటున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా పిల్లలు వయస్సులో చిన్నవారైనప్పటికీ వారికి ఉన్న మేధస్సు వారి వయసును మించి ఉంటుంది. వీరిని గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రెన్ అంటారు. వారి ఇంటలీజెన్స్, ఐక్యూ లెవెల్స్ ఉండవలసిన దానికన్న ఎక్కువ ఉంటాయి. వారిని అత్యున్నత ప్రతిభావంతులు అంటారు. కొందరు పిల్లలు ఏక సంతాగ్రాహులు కూడా ఉంటారు. ఒకసారి వింటే, చూస్తే చాలు దానిని ఇక మర్చిపోరు. వారణాసి జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక కూడా మిరాకిల్ కిడ్ గా గుర్తింపు పొందింది. తను కళ్లకు గంతలు కట్టుకుని వివిధ రంగులను, కరెన్సీ నోట్లను గుర్తిస్తుంది. కళ్లకు గంతలతోనే సైకిల్ రైడింగ్ కూడా చేస్తుంది. ఆ అమ్మాయి గురించి పూర్తి విరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా లోహతా హర్‌పాల్‌పుర్ గ్రామానికి చెందిన రియా తివారీ పదో తరగతి చదువుతోంది. ఆ అమ్మాయి వయస్సు 14 సంవత్సరాలు. చదువుతోపాటుగా ధ్యానం, యోగా లాంటి వాటిపై ఆసక్తి చూపేది. రియా వాళ్ల నాన్న ప్రోత్సాహంతో మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్సు నేర్చుకుంది. ఈ కోర్సు మూడు నెలల పాటు చేసింది. ఇందులో యోగా, మెడిటేషన్, వ్యాయామం చేసింది. ఆ కోర్సు పూర్తి అయిన తర్వాత కళ్లకు గంతలు కట్టుకుని చుట్టుపక్కల పరిసరాలను, రంగులను గుర్తిస్తుంది. స్పర్శతో కరెన్సీ నోట్లను, పేక ముక్కలను అతి సులభంగా గుర్తిస్తుంది. కళ్లకు గంతలు ఉండగానే కొన్ని కిలో మీటర్లు సైకిల్ రైడ్ చేస్తుంది ఈ మిరాకిల్ కిడ్. వస్తువలను అనుభూతి చెంది గుర్తిస్తానని రియా తెలిపింది. యోగా, మెడిటేషన్ తో ఇలా చేయడం సాధ్యమైందని తెలిపింది.
ఈ సందర్భంగా రియా వాళ్ల ఫాదర్ మాట్లాడుతూ..రియాకు అసాధారణ శక్తులు ఏమీ లేవని.. యోగా,మెడిటేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి సాధ్యమేనని రియా తండ్రి రాజన్ తెలిపారు. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్సు చేయడంతో ఇలా చేయవచ్చని అన్నారు. ఈ కోర్సు పిల్లల మెమోరీని పెంపొందిస్తుందని.. ఈ కోర్సులో కళ్లకు గంతలు కట్టుకుని అన్నీ చూసే కళను కూడా నేర్పుతారని అన్నారు. రియా సాధారణ పిల్లల మాదిరిగానే అన్ని పనులను చేసుకుంటుందని.. కళ్లకు గంతలు కట్టుకుని కూడా పనులన్నీ చేసుకుంటుందన్నారు. దీంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో పిల్లలు చాలా సులభంగా పాసవుతారని రాజన్ అన్నారు.
మెదడులో మూడు భాగాలుంటాయి. కుడి, ఎడమ కాకుండా, రెంటినీ సమన్వయపరిచేది ఇంటర్ బ్రెయిన్ లేదా మిడ్ బ్రెయిన్ అంటారు. సాధారణంగా పిల్లలు ఎడమ వైపు ఉన్న మెదడునే ఉపయోగిస్తారు. కుడి మెదడు వాడడం చాలా తక్కువ. మనిషికి ఉన్న కుడి మెదడు చాలా శక్తివంతమైనదే. దీని ఉపయోగం రేర్ గా సాధ్యమవుతుంది. దీనివలన తార్కిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. రెండు మెదళ్ల మధ్య బ్రిడ్జ్ చురుకుగా మారినపుడు, పిల్లలు ఆల్ రౌండర్ అవుతారు. అలాంటి పిల్లల ఎమోషనల్ కోషెంట్, ఇంటలిజెన్స్ కోషెంట్ ఒకేసారి పెరుగుతాయి. చదువులు, లాజికల్ థింకింగ్ కి ఎడమ మెదడు ఉపయోగపడుతుంది. సృజనాత్మకతకు కుడి మెదడు అవసరమవుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలపండి.