మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంటర్ అయ్యి నేటితో (జూలై 20) నెల రోజులవుతోంది. తమ ఇంట్లో మహాలక్ష్మీ అడుగు పెట్టడంతో మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. పాప జన్మించిన 10వ రోజున ఊయలలో వేయడంతో పాటు నామకరణం కూడా చేశారు.
మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంటర్ అయ్యి నేటితో (జూలై 20) నెల రోజులవుతోంది. తమ ఇంట్లో మహాలక్ష్మీ అడుగు పెట్టడంతో మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. పాప జన్మించిన 10వ రోజున ఊయలలో వేయడంతో పాటు నామకరణం కూడా చేశారు. లిటిల్ ప్రిన్సెస్‌కు క్లీంకార అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల డెలివరీకి ముందు హాస్పిటల్‌లోని తన గదిని దగ్గరుండి డిజైన్ చేయించుకున్న వీడియో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇవాళ ఉసాసన కొణిదెల పుట్టినరోజు. పాప పుట్టి నెల కావడం, అదే రోజు భార్య బర్త్‌డే కూడా కావడంతో ఈ సందర్భంగా రామ్ చరణ్ ఓ బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేశారు. స్పెషల్ అకేషన్ నాడు మెమరబుల్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్, ఆడియన్స్‌తో పంచుకున్నారు.
ఇక ఈ వీడియోలో పలు అందమైన జ్ఞాపకాలకు సంబంధించిన అపురూప క్షణాలను పొందుపరిచారు. అలాగే చరణ్ – ఉపాసన, చిరంజీవి, ఉపాసన పేరెంట్స్ మాట్లాడిన బిట్స్ కూడా ఉన్నాయి. దాదాపు 3 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో ఉపాసన డెలివరీ రోజు ఆస్పత్రిలో, నామకరణం రోజు ఇంట్లో ఏం జరిగిందనేది చూపించారు. చెర్రీ – ఉపాసనల పెళ్లి నుంచి.. చరణ్ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లడం, పాపను ఎత్తుకుని బయటకు రావడం.. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ చిన్నారిని చూసి సంతోషపడడం లాంటి వాటిని అందంగా క్యాప్చర్ చేశారు. చివరకు ఉపాసన పాపను ఎత్తుకున్నట్లు చూపిస్తూ వీడియో ఎండ్ చేశారు.
ఈ వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘క్లీంకార పుట్టే టైంలో మా అందరిలోనూ ఏదో తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరం ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా పాప ఈ లోకంలోకి అడుగుపెట్టిందని భావిస్తున్నా. పాప పుట్టిన క్షణం నా మనసుకు ఆహ్లాదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప రాకకు పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం’ అన్నారు.
ఉపాసన మాట్లాడుతూ.. ‘మా పాప ద్రవిడ సంసృతిలో భాగం కావాలాని కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వొద్దు. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలనేది నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో కీలకం. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి’ అని చెప్పుకొచ్చారు.