ఓ స్టార్ హీరో కాని.., ఓ స్టార్ హీరోయిన్ కాని ఓ మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఏమి మాట్లాడినా.., కొన్ని కోట్ల మంది వింటారు. ఇక కొన్ని దశాబ్దాల పాటు.., సౌత్ ఇండియన్ సినిమాని ఏలిన కుష్బూ లాంటి హీరోయిన్.. ఒక హీరోతో “నీ చెల్లిని నా తమ్ముడి గదిలోకి పంపు”..! అనే మాటని వాడటం చాలా పెద్ద విషయమే. మరి.., కుష్బూకి ఈ మాట అనాల్సిన అవసరం ఎప్పుడొచ్చింది? అసలేంటి ఈ కథ? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు చలనచిత్ర రంగంలోకి ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కుష్బూ. తరువాత కాలంలో ఈ బొద్దు బ్యూటీ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ సమయంలో తమిళనాట చాలా బిజీగా ఉంటూనే.., తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది కుష్బూ. ఇదంతా గతం.
ప్రస్తుతం కుష్బూ రాజకీయాలతో బిజీగా ఉంది. ఇదే సమయంలో చాలా సెలెక్టివ్ గా ముందుకి వెళ్తూ.., క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. తాజాగా కుష్బూ ఓ సంచలన నిజాన్ని బయట పెట్టింది. “మీ టూ” అనుభవాలు ఇండస్ట్రీలో ఇప్పుడే కొత్తగా పుట్టుకుని రాలేదు. కెరీర్ మొదట్లో ఇలాంటి అనుభవాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను అని కుష్బూ తెలియచేసింది.
అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరో ఒకరు తనను కమిట్మెంట్ అడిగినట్లు కుష్బూ చెప్పుకొచ్చింది. ఆ స్టార్ హీరో కమిట్మెంట్ అడిగేసరికి చాలా కోపం వచ్చిందని, దాంతో.., మీ చెల్లెలిని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే.. తాను కూడా కమిట్మెంట్ ఇస్తానని చెప్పినట్లు కుష్బూ వెల్లడించింది. అప్పట్నుంచి ఆ హీరోతో తనకు మాటలు లేవని ఆమె తెలిపింది ఈ మాజీ హీరోయిన్. దీంతో.., కుష్బూ ని కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. మరి కొంతమంది మాత్రం.., ఆరోజుల్లోనే కుష్బూ చూపించిన తెగువకి ఆమెని తెగ మెచ్చుకుంటుండటం విశేషం.