ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమా మేనియా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. రాఖీ భాయ్‌కి థియేటర్ల వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్ మీడాయాలోనూ కేజీఎఫ్ సినిమా గురించే చర్చలు మీద చర్చలు జరుగుతున్నాయి. ఈసారి సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి డబ్బింగ్ మీద పెట్టిన ప్రత్యేక శ్రద్ధ అనే చెప్పాలి. ప్రతి భాషలోనూ మంచి ఆర్టిస్టులను తీసుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా తెలుగు విషయానికి వస్తే ఇది స్ట్రైట్ తెలుగు సినిమా అనే భావన కలుగుతుంది. అసలు తెలుగులో ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ ఎవరు చెప్పారు అనేది చూద్దాం.
రాఖీభాయ్దాదాపు అన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలకు వాయిస్ వాసునే ఇస్తాడు. ఈ సినిమాకి కూడా రాఖీకి డబ్బింగ్ వాసు ఇచ్చాడు.
యంగ్ రాఖీరాఖీ చిన్నప్పటి పాత్రకు కూడా మంచి డైలాగ్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అతని మాటల్లో కసి ఉంటుంది. అంత మంచి పాత్రకు చరణ్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పాడు.
శాంతికేజీఎఫ్ సిరీస్‌లో రాఖీ భాయ్ కన్నా కూడా ముఖ్యమైన పాత్ర అతని తల్లి శాంతి. హీరోని నడిపించే పాత్ర. అలాంటి ప్రాధాన్యమున్న పాత్రకు ఆర్టిస్ట్ కమలా నాయుడు డబ్బింగ్ చెప్పారు. తల్లి మాటల్లో బాధ, ప్రేమ, ఆవేశం, ఆవేదనను పలికించి అందరినీ ఆకట్టుకున్నారు.
అనంత్ నాగ్అనంత్ నాగ్ పాత్రతోనే కేజీఎఫ్ సినిమా మొదలౌతుంది. ఆ పాత్రకు ఛాప్టర్2లోనూ మంచి ఎలివేషన్స్, గుర్తింపు(యంగ్ గా ఉన్నప్పటి సీన్స్) ఉంటుంది. ఆ పాత్రకు డైలాగ్స్ శుభలేఖల సుధాకర్ చెప్పారు.
గరుడమొదటి భాగంలో ప్రతినాయకుడిగా గరుడ ఫుల్ డామినేటింగ్ రోల్ ఉంటుంది. అందుకే మంచి బేస్ వాయిస్ ఉన్న మన బిగ్ బాస్ కి వాయిస్ చెప్పె ఆర్టిస్ట్ రాధాకృష్ణను ఎంచుకున్నారు.
రాఖీ చాచామొదటి పార్ట్ రాఖీ ఇంట్రడక్షన్ ఈ పాత్రతోనే మొదలవుతుంది. ఛాప్టర్ 2లోనూ మంచి స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్ర. ఖాసీమ్ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గోపి వాయిస్ ఇచ్చాడు.
శెట్టి భాయ్రాఖీ శెట్టి దగ్గరే పనికి చేరి ఆ తర్వాత శెట్టిని ఎదిరించే స్థాయికి ఎదుగుతాడు. ఆ సమయంలో రాఖీ తొక్కేందుకు శెట్టి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ పాత్రకు ఉదయ్ రాజ్ అనే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పాడు.
రీనాహీరోయిన్ పాత్రకు మొదటి పార్ట్ లో పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఛాప్టర్-2లో మంచి ప్రాధాన్యం లభించింది. ఈ పాత్రకు ఆర్టిస్ట్ జ్యోతి వర్మ డబ్బింగ్ చెప్పారు.
మాళవికా అవినాష్- రవీనా టాండన్:ఈ రెండు పాత్రలు సినిమాలో ఎంతో కీలకమైనవి. ఒకటి కథను ముందుకు తీసుకెళ్తుంటే.. మరొకటి రాఖీ భాయ్ కు ఎదురెళ్లే పాత్ర. ఈ రెండు పాత్రలకు క్రాంతి డబ్బింగ్ చెప్పారు.
న్యూస్ ఛానల్ అధిపతికథను ముందుకు తీసుకెళ్లడంలో న్యూస్ ఛానల్ అధిపతి పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. ఆ పాత్రకు డబ్బింగ్ కిశోర్ చెప్పారు.
కమల్సినిమాలో ఉండే ముఖ్యమైన విలన్స్ లో కమల్ కూడా ఒకడు. ఛాప్టర్ 2లో ఉన్నది కాసేపే అయినా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఆ పాత్రకు ప్రముఖ విలన్ క్యారెక్టర్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు చెప్పాడు.
దయఛాప్టర్ 2లో కమల్ తర్వాత దయ ఫుల్ టైమ్ విలన్ గా మారతాడు. ఆ పాత్రకు కేవీఆర్ మూర్తి డబ్బింగ్ చెప్పాడు.
రాజేంద్ర దేశాయ్హీరోయిన్ తండ్రి, ప్రధాన విలన్ అయిన రాజేంద్ర దేశాయ్ పాత్రకు డబ్బింగ్ ఈశ్వర్ చెప్పాడు.
పిచ్చోడి క్యారెక్టర్ఈ క్యారెక్టర్ అంటే ప్రేక్షకులకు ఎంతో అభిమానం. మొదటి పార్ట్ లో హీరో ఎలివేషన్ కు ఇతని పాత్రనే వాడుకున్నారు. కానీ, రియల్ లైఫ్ లో చనిపోవడం వల్ల ఛాప్టర్ 2లో ఆ పాత్రను కొనసాగించలేకపోయారు. ఆ పాత్రకు డబ్బింగ్ మోహన్ రావు చెప్పాడు.
స్టోరీ టెల్లర్‘గ్యాగ్ తో వచ్చేవాడు గ్యాంగ్‌స్టర్.. కానీ వీడు ఒక్కడే వస్తాడు మాన్స్టర్’ అంటూ రాఖీని ఎత్తేస్తూ స్టోరీ చెప్పే పాత్రకు యాక్టర్ జీవా డబ్బింగ్ చెప్పారు.
ప్యూన్ క్యారెక్టర్ఈ సినిమాలో ఈ పాత్రకు కూడా మంచి స్థానం ఉంది. డబ్బు సంపాదించడం కోసం సిటీ వచ్చి ఓ మీడియా సంస్థలో ప్యూన్ గా చేరతాడు. ఆ తర్వాత రాఖీ స్టోరీ వింటూ బాగా కనెక్ట్ అవుతాడు. ఆ పాత్రకు సినిమా ఆర్టిస్ట్ లక్ష్మణ్ డబ్బింగ్ చెప్పాడు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.