‘సలార్’ టీజర్ జులై 6 న ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేశారు. ప్రభాస్‌ని డైనోసర్‌తో పోల్చుతూ కొత్త తాత ఇచ్చిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. టీజర్లో ప్రభాస్ కనిపించేది పది సెకన్లలోపే అయినా ముఖం చూపించకపోవడం ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మూవీ ‘సలార్’. ‘బాహుబలి’, ‘కేజీయఫ్’ తరహాలోనే ఈ మూవీ కూడా రెండు పార్ట్‌లుగా తెరకెక్కబోతుంది. జూలై 6 తెల్లవారు జామున ‘సలార్ పార్ట్ 1 – సీజ్ ఫైర్’ టీజర్ రిలీజ్ చేశారు. ‘సాహో’, ‘రాధే శ్యామ్’ లతో పాటు ఇటీవల వచ్చిన ‘ఆదిపురుష్’ కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌ని నిరాశకు గురిచేసింది. దీంతో ‘సలార్’ మీదే ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. టీజర్‌తో ఫ్యాన్స్‌ని ఖుషి చేశాడు ప్రభాస్. రఫ్ లుక్‌లో, గన్స్, వెపన్స్‌తో విధ్వంసం సృష్టిస్తూ కనిపించాడు. ఇప్పుడీ టీజర్ పాత రికార్డులన్నిటినీ బీట్ చేసేసింది. ప్రభాస్ దెబ్బకి కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. టీజర్ ఎలా ఉందనే విషయం పక్కన పెడితే.. ఒక్క దెబ్బకి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఇలా అన్ని విషయాల్లో అదరగొడుతున్న ‘సలార్’ టీజర్ ఒక్క విషయంలో మాత్రం ‘కేజీయఫ్ 2’ ను దాటలేకపోయింది.
‘సలార్’ టీజర్ జులై 6 న ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేశారు. ప్రభాస్‌ని డైనోసర్‌తో పోల్చుతూ కొత్త తాత ఇచ్చిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. టీజర్లో ప్రభాస్ కనిపించేది పది సెకన్లలోపే అయినా ముఖం చూపించకపోవడం ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేసింది. ప్రభాస్‌ని సరిగ్గా చూపించకపోతేనేం, 24 గంటల్లో ఏకంగా 83 మిలియన్ల వ్యూస్, 1.67 మిలియన్ల లైక్స్ సాధించింది. ఈ క్రమంలోనే ఒక్క రోజులోనే క్కువ వ్యూస్ అందుకున్న టీజర్‌గా అగ్రస్థానం దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో ఆదిపురుష్ (68.96 మిలియన్స్), కేజీయఫ్ 2 (68.83 మిలియన్స్), రాధే శ్యామ్ (42.66 మిలియన్స్) ఉన్నాయి. ఇలా టాప్ 4లో ప్రభాస్‌వే మూడు చిత్రాలు ఉండటం విశేషం.
అయితే లైక్స్ విషయంలో సలార్ టీజర్, కేజీయఫ్ టీజర్‌ను దాటలేకపోయింది. దానికి ఫ్యాన్స్ కొద్దిగా నిరాశపడుతున్నట్టు తెలుస్తుంది. టీజర్‌కి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా.. సినిమా మీద మాత్రం భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు, కేజీయఫ్ తో సంబంధం ఉందని, టీజర్లో అందుకు సంబంధించిన ఆధారాలు కనిపించాయంటూ న్యూస్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. శ్రుతి హాసన్, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియ రెడ్డి తదితరులు నటిస్తున్న ‘సలార్’ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న థియేటర్లలోకి రానుంది. మరి ఈ మూవీ కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.