ప్రస్తుతం కేజీఎఫ్-2 సినిమా మేనియా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. రాఖీ భాయ్‌కి థియేటర్ల వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్ మీడియాలోనూ KGF-2 సినిమా గురించే చర్చలు మీద చర్చలు జరుగుతున్నాయి. ‘పుష్ప’ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎలా రచ్చ చేశాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా కేజీఎఫ్-2లో రాఖీ భాయ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నాయి. అందులోని “వాయిలెన్స్..వాయిలెన్స్” అనే డైలాగ్ ఏకంగా పెళ్లి పత్రికలో అచ్చు వేయించాడు ఓ అభిమాని. ఇప్పుడు ఆ పెళ్లి పత్రిక తెగ వైరల్ అవుతోంది.
కర్టాటకలోని బెళాగావికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి యాష్ కి అభిమాని. అదే సమయంలో కేజీఎఫ్ సినిమాకి కూడా పెద్ద ఫ్యాన్. ఇటీవల చంద్రశేఖర్ కి వివాహం కుదిరింది. తన పెళ్లి శుభలేఖలో KGF-2 మూవీలోని డైలాగ్ ను ప్రింట్ వేయించాడు అతడు. కేజీఎప్-2 లో “వాయిలెన్స్.. వాయిలెన్స్.. వాయిలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవైడ్.. బట్ వాయిలెన్స్ లైక్స్ మి” అనే డైలాగ్ మాదిరిగానే చంద్రశేఖర్ తన పెళ్లి పత్రిక ఓ డైలాగ్ అచ్చు వేయించాడు. ” మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవైడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. సో ఐ కాంట్ అవైట్ ” అని ప్రింట్ వేయించాడు. ఇప్పుడు ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇదెక్కడి మాస్ రా బాబు! అంటూ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.