కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చివరి సినిమా జేమ్స్. అప్పు జయంతి సందర్భంగా మార్చి 17న 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో అట్టహాసంగా విడుదల అయ్యింది. కర్ణాటకలో మార్చి 17 నుంచి 24 వరకు వారం మొత్తం జేమ్స్ సినిమానే ప్రదర్శిస్తామని డిస్టిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మాములుగా సినిమా విడుదల అయ్యాక విమర్శకులు, మీడియా చూసి రివ్యూ చెప్తారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కాకుండా న్యూట్రల్ గా ఉండే వాళ్లు ఆ రివ్యూని చూసి నిర్ణయించుకుంటారు. అయితే ఇప్పడు జేమ్స్ సినిమా గురించి అప్పు ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: రామ్ చరణ్ మంచి మనసు.. ఉక్రెయిన్లోని తన సెక్యూరిటీ గార్డుకి ఆర్థిక సాయం!
అవును జేమ్స్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ పై పునీత్ రాజ్ కుమార్ చెప్పిన మాటలను ది బిగ్ లిటిల్ అనే కన్నడ మూవీ కంపెనీ విడుదల చేసింది. ఆ ఆడియో జేమ్స్ కు ఫైట్స్ కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్ రవివర్మతో పునీత్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. అందులో అప్పు ‘మాస్టర్ చాలా బాగా వచ్చింది. క్వాలిటీ, యాక్షన్ సీక్వెన్స్, కటింగ్, స్పిన్నింగ్, సౌండ్, గ్రాఫిక్స్ మొత్తం ఎంతో అద్భుతంగా వచ్చాయి. థాంక్యూ మాస్టర్’ అంటూ పునీత్ స్టంట్ మాస్టర్ రవివర్మతో మాట్లాడారు. ఆ వైరల్ ఆడియో ఒకసారి మీరూ వినేయండి.