అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. పేరుకు కన్నడ హీరోయిన్ అయినా కూడా.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించేవారు. ఆవిడ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ప్రేమ వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
అలనాటి హీరోయిన్, కన్నడ బ్యూటీ ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల్లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ, 2010 నుంచి వెండితెరకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమను చాలా కాలం తరువాత ఓ ఇంటర్యూల్లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో వ్యక్తిగత జీవితం, కుటుంబం, సినిమా కెరీర్ గురించి ప్రేమ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తెలుగు ప్రేక్షకులపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోతే టాలీవుడ్ లో గొప్ప నటిని కాలేకపోయాను అంటూ కామెంట్ చేశారు. అంతే కాక తన జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు.
ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో ప్రేమ అడుగు పెట్టారు. ఎయిర్ హోస్టెస్ అవుదామనుకున్న ఆమె హీరోయిన్ గా మారింది. తన అందంతో, సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. 1995లో సవ్వసాచి అనే కన్నడ సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించి.. అప్పటి యువతకు కలల రాణిగా మారిపోయారు. కన్నడలో స్టార్ హీరోలందరితో ప్రేమ జోడి కట్టింది. అలానే తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ఇక ఆమె వ్యక్తి గత జీవితం విషయానికి వస్తే.. జీవన్ అప్పాచ్చు అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రేమ కొంతకాలానికే అతడికి విడాకులు ఇచ్చేసేంది. చాలాకాలం పాటు వెండితెరపై, సోషల్ మీడియాలో కనిపించని ప్రేమ.. తాజాగా ఓ ఇంటర్వూల్లో పాల్గొన్ని తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. ఇక ప్రేమ మాట్లాడుతూ..”పెళ్లైన కొంతకాలానికి విడాకులు తీసుకున్నాను. నా నిర్ణయాన్ని తొలుత మా అమ్మనాన్నకు చెప్పాను. వాళ్లు నా నిర్ణయానికి మద్దతు తెలిపారు. చాలా మందికి అలాంటి సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. నా స్థానంలో ఎవరు ఉన్న ఆత్మహత్య చేసుకునే వాళ్లు.
కానీ నేను అలా సూసైడ్ చేసుకోలేదు. ఈ సమస్యను ఓ ఛాలెంజ్ గా తీసుకున్నాను. పెళ్లనేదే జీవితం కాదని నేను భావించాను. ఎవరైన ఛాలెంజ్ లు స్వీకరిస్తేనే ధృడంగా తయారవుతారు” అని ఆమె అన్నారు. తాను చాలా సున్నితమైన, ఎమోషనల్ గా ఉండేదానని, కానీ సమస్యలను ఎదుర్కొంటు ధృడంగా మారానని ప్రేమ తెలిపారు. అలానే తనకు క్యాన్సర్ వచ్చిందంటూ రూమర్స్ వచ్చాయాని, ఆ సమయంలో తాను చాలా బాధపడినట్లు తెలిపారు. డిప్రెషన్ లో ఉండి ఆస్ట్రేలియా వెళ్తే.. తనకు క్యాన్సర్ ఉందని వ్యాప్తి చేశారని చెప్తూ ప్రేమ ఎమోషనల్ అయ్యారు. మరి.. ప్రేమ తన జీవితంలో తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.