టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొడుకుకు ‘నీల్ కిచ్లూ‘ అని పేరు కూడా పెట్టేశారు ఇప్పటికే. 2020లో గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కాజల్ ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. ‘మదర్స్ డే’ సందర్భంగా కాజల్ తన బిడ్డతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
నిషా అగర్వాల్, ఆమె కొడుకు సహా కుటుంబసభ్యులు నీల్‌ను ఎత్తుకొని ముద్దుచేస్తున్న ఫోటోలను కాజల్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఇన్స్టాగ్రామ్‌లో కొడుకు ఫోటోను షేర్ చేస్తూ కాజల్ ఎమోషనల్ స్టోరీని రాసుకొచ్చింది. నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వే నా నక్షత్రాలన్ని అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా తొలిసారి తల్లైన కాజల్‌కు ప్రముఖులు సహా నెటిజన్లు మథర్స్ డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Kajal Aggarwal: కాజల్ కమ్ బ్యాక్! తల్లి అయ్యాక ఫస్ట్ ఫోటోతోనే రచ్చ!