తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన జీవితంలో ఎంతో అద్భుతమైన క్షణాలను అనుభవిస్తోంది. బేబీ బంప్ తో ఫొటో షూట్స్ చేస్తూ మధుర క్షణాలను కెమెరాలో బందిస్తోంది. తాజాగా తన భర్త గౌతమ్ కిచ్లూని ఉద్దేశిస్తూ కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. తన భర్త ఈ ఎనిమిది నెలలు ఎలా చూసుకున్నాడు. అతను చూపించిన కేరింగ్ మొత్తాన్ని గుర్తుచేస్తూ ఓ నోట్ పెట్టింది.
ఇదీ చదవండి: సింగర్ సునీత అందానికి నెటిజన్ ఫిదా! భార్య ముందు అడ్డంగా బుక్కయ్యాడు!
‘డియర్ గౌతమ్.. ఓ మంచి భర్తగా నాకెప్పుడూ తోడుగా ఉన్నావు. ప్రతి ఆడపిల్ల కోరుకునే తండ్రిగా నువ్వు ఉన్నావ్. ఇలాంటి సమయంలో అన్నీ సౌకర్యంగా ఉండేలా చూసుకున్నావు. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశావు. నేను ప్రతిక్షణం సతోషంగా ఉండేలా చేశావు. మన ముద్దుల బేబీ త్వరలో ఈ లోకంలోకి రానుంది. ఈ సందర్భంలో నువ్వు ఎంత అద్భుతమైన వ్యక్తివో నీకు గుర్తుచేయాలనుకున్నా.ఈ ఎనిమిది నెలల్లో నీలో ఒక మంచి తండ్రిని చూశాను. పుట్టబోయే బిడ్డను సురక్షితంగా ఉంచేందుకు ఎంత శ్రమిస్తున్నావో చూశాను. నువ్వు చూపించి ఈ ప్రేమ మన బిడ్డ అదృష్టంగా భావిస్తున్నాను. నువ్వు ఎప్పుడూ తనకి ఒక ఇన్ స్పిరేషన్ గా ఉంటావు. తర్వలో మన జీవితాల్లో ఎన్నో మార్పులు రానున్నాయి. ఒకప్పటిలా టీవీ షోలు చూసుకుంటూ నిద్రలేని రాత్రులు గడపలేం. వీకెండ్ లో సినిమాలు, షికార్లకు వెళ్లలేం. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీలు, డేట్ నైట్స్ కు దూరం కాబోతున్నాం. కానీ వాటన్నింటికీ మించి మన బేబీతో అద్భుతమైన లక్షణాలను గడపబోతున్నాం. తన రాకతో మన జీవితంలో ప్రతిక్షణం మరింత ఆనందగా మారనుంది. మనకంటూ సమయాన్ని సమయాన్ని కేటాయించుకోకలేకపోవడం, అనారోగ్యానికి గురికావడం ఉన్నా.. ఇవి మన జీవితంలో ఉత్తమ క్షణాలు. సిట్యువేషన్స్ మారచ్చోమో గానీ, నీపై నాకున్న ప్రేమ మారదు. ఐ లవ్ యూ’ అంటూ కాజల్ రాసుకొచ్చింది. కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.