కన్నడ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. పునీత్ రాజ్ కుమార్ పార్దీవ దేహానికి నివాళులు అర్పించడానికి అన్నీ సినీ ఇండస్ట్రీల నుండి స్టార్స్ అంతా బెంగుళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ యన్టీఆర్ కూడా కంఠీరవ స్టేడియానికి చేరుకొని పునీత్ రాజ్ కుమార్ పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు.
కిక్కిరిసిన అభిమానుల మధ్య యన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలసి అక్కడికి చేరుకున్నారు. తరువాత చాలా సేపు పునీత్ పార్దీవ దేహాన్ని చూస్తూ యన్టీఆర్ అక్కడే నిలుచుండి పోయారు. తరువాత అటుగా వచ్చిన శివన్నని కౌగిలించుకుని యన్టీఆర్ భావేద్వేగానికి గురయ్యారు. కాగా.. జూనియర్ యన్టీఆర్ ని పునీత్ రాజ్ కుమార్ సొంత తమ్ముడిగా భావించేవారు. తెలుగు సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి ఆయన తారక్ ప్రస్తావన తీసుకొచ్చేవారు.
తన సినిమాలో కూడా ఎరికోరి యన్టీఆర్ చేత ఓ పాట పాడించుకున్నారు పునీత్ రాజ్ కుమార్. తనపై ఇంతటి అభిమానాన్ని చూపించే పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ళ వయసులోనే కన్ను మూయడంతో తారక్ తీవ్ర విషాదంలో కనిపించారు. ఇక ముందుగా నందమూరి బాలకృష్ణ కూడా పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. మరి.., తక్కువ వయసులోనే తిరిగిరాని లోకాలకి పయనమైన పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.