ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారు మోగుతున్న సినిమా పేరిది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆర్ఆర్ఆర్ ఓ సుపరిచిత పదంగా మారిపోయింది. ఈ సినిమా తెలుగు ఖ్యాతిని అమాంతం పెంచేసింది. ఇండియన్ సినిమాకు ముందెన్నడూ లేని కొత్త వైభవాన్ని తీసుకువచ్చింది. కలెక్షన్ల పరంగానే కాదు.. అవార్డుల విషయంలో ఈ సినిమా రికార్డులను సృష్టిస్తోంది. గతంలో ప్రపంచ వేదికల్లో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. నాటు, నాటు పాటకు బెస్ట్ సాంగ్ అవార్డు వచ్చింది. దీంతో భారత ప్రధాని దగ్గరి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రిటీలు ఆర్ఆర్ఆర్ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి జక్కన్న, కీరవాణి, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు తమ భార్యలతో హాజరయ్యారు.
రెడ్ కార్పెట్‌పై తమదైన స్టైల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రెడ్ కార్పెట్‌పై జూ.ఎన్టీఆర్ తన ఇంగ్లీష్ స్పీచుతో అదరగొట్టారు. అక్కడి ఓ హోస్ట్ జూ.ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఆర్ఆర్ఆర్కు వస్తున్న స్పందన గురించి అడగ్గా.. ‘‘ ఆర్ఆర్ఆర్కు ఇంత మంచి స్పందన వస్తుందని మేము అనుకోలేదు. రాజమౌళి ట్రాక్ రికార్డుకు విన్నర్ అవుతామని తెలుసు కానీ, ఇంత పెద్ద విజయం సాధిస్తామని అనుకోలేదు’’ అన్నారు. మార్వెల్‌లో సినిమా చేయటంపై అడిగిన ప్రశ్నకు తాను, తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, జూ.ఎన్టీఆర్ ఇంగ్లీష్ స్పీచుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#JrNTR #RRRMovie is making us proud! @tarak9999 at the Red carpet of #GoldenGlobes2023 ! The world is cheering for our Indian Film! 🔥❤️ #RRR #SiddharthKannan #SidK pic.twitter.com/2b9OlgGqQ0
— Siddharth Kannan (@sidkannan) January 11, 2023