తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు ప్రేక్షకులు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఈ వేదికపై ఇప్పటికే ఎన్నో షోలు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నాయి. ఇక ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎవరు మీలో కోటీశ్వరులు షో తాజాగా ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఇందులో గెస్ట్‌గా వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మంచి మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు ఇద్దరు బడా హీరోలు. దీంతో ముందుగా ఈ షో సులువైన మాటలతో ప్రారంభమై ఆ తర్వాత తమ వ్యక్తిగత ఇష్టాల వరకూ వెళ్లింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ జంతు ప్రేమికులన్న విషయం అందరికీ తెలిసిందే. జంతువుల పట్ల వారి ప్రేమను వెలకట్టలేనిదనే చెప్పాలి. ఇక ఈ షోలో మాట మాట కలిసి జంతువుల చర్చకు దారి తీసింది. ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్‌కు జంతువులంటే ఎనలేని ప్రేమ అని తెలిపారు. ఇక గతంలో ఎన్నో కుక్కలను ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకున్నారని అన్నారు. ఇక ఇదే కాకుండా హైదరాబాద్‌లో లేని అతి పెద్ద సైజ్ కుక్క ఎన్టీఆర్ ఇంట్లో ఉండేదని , ఇప్పుడు ఆ కుక్క మన మధ్య లేదని తెలిపారు.
వెంటనే ఆవేదనకు లోనైన ఎన్టీఆర్ అవును..ఆ కుక్క చనిపోయిన తర్వాత నా హార్ట్ బ్రేక్ అయిందని తెలిపారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవటంతో సినిమా విడుదల విషయంలో కాస్త నీలినీడలు కమ్ముకుంటున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తారనది ఇంకా తెలియాల్సి ఉంది.