అలనాటి అందాల తార.. అతిలోక సుందరి నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో చేస్తూ కుర్రాల మతులు పోగొడుతుంది. బాలీవుడ్ లో దడక్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది.
జాన్వీ కపూర్ ఓ రియాల్టీ షోలో మాట్లాడుతూ.. డేటింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన తల్లి శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ కి డేటింగ్ కాన్సెప్ట్ అస్సలు నచ్చదని.. తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలన్నది వారి అభిమతమని చెప్పింది. ప్రస్తుతం తాను ఎవరితో డేటింగ్ లో లేనని.. కెరీర్ పైనే పూర్తి దృష్టి సారిస్తున్నట్లు జాన్వీ తెలిపింది.
ఇక డేటింగ్ విషయంలో అమ్మానాన్నలది విభిన్నమైన అభిప్రాయమని జాన్వీ కపూర్ తెలిపింది. ఏ అబ్బాయిని ఇష్టపడ్డా అతడితో పెళ్లి చేస్తాం అన్నట్టు వారు ఉండేవారని… అలా అని మనకు నచ్చిన ప్రతీ అబ్బాయిని పెళ్లి చేసుకోనవసరం కుదరదు కదా అన్నారు. గతంలో అక్షత్ రాజ్ అనే వ్యక్తితో జాన్వి ప్రేమలో ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.