ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూడా జాయిన్ అయినట్లు ప్రకటించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొత్త మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ. దేశం మొత్తం షేక్ చేయడమే టార్గెట్ పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. ధనాధన్ లాడిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్.. చిత్రీకరణకు హాజరు కాగా.. ఇప్పుడు విలన్ సైఫ్ అలీఖాన్ కూడా వచ్చేశాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. గత కొన్నాళ్ల నుంచి వస్తున్న రూమర్స్ కి పుల్ స్టాప్ పెట్టేశారు.
ఇక విషయానికొస్తే.. మొన్నటివరకు టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ రేంజ్, ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్ ఫేమస్ అయింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం అతడి గురించి మాట్లాడుకున్నారు. దీంతో తన నెక్స్ట్ మూవీని అందుకు తగ్గట్లే తీస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ లోని షూట్ కు జాయిన్ అయింది. ఇప్పుడు విలన్ గా చేస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూడా వచ్చి చేరాడు. గతంలో ఇతడి బయటకొచ్చేశాడనే రూమర్స్ వచ్చాయి. తాజా ఫొటోలతో వాటికి చెక్ పడినట్లు అయింది.
అయితే సైఫ్ అలీఖాన్.. NTR30లో విలన్ గా చేస్తున్నాడు అని దాదాపు ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడు దీన్నే ఏదో కొత్త విషయంలా నిర్మాణ సంస్థ ట్వీట్ చేయడం కాస్త ఆశ్చర్యపరిచింది. జాతీయ అవార్డు విన్నింగ్ నటుడు అయిన సైఫ్.. ఈ మూవీలో విలన్ గా ఎలాంటి రోల్ చేస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. డైరెక్టర్ కొరటాల చెప్పిన దానిబట్టి.. మోస్ వయలెంట్ మూవీగా దీన్ని తీస్తున్నారు. అంటే ఎన్టీఆర్-సైఫ్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉండటం పక్కా అనిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమా కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. కింద కామెంట్ చేయండి.
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023