ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారు గుండెల్ని పిండేస్తుంటుంది జాన్వీ కపూర్. తాజాగా మరోసారి తన అందాల రచ్చతో యువకులకు సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
హీరోయిన్లకు సినిమాలు హిట్ అయితేనే పాపులారిటీ. కానీ జాన్వీ కపూర్ కి మాత్రం ఆ అవసరం లేదు. తన అందాలతోనే సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. అందరూ వీలు చిక్కినప్పుడల్లా హాట్ ఫొటోలతో మెరిస్తే.. ఈ అమ్మడు మాత్రం రోజుకొక వెరైటీతో హాట్ లుక్కులో దర్శనమిస్తోంది. సినిమాలు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా నా రూటే సెపరేట్ అన్నట్లు ఉంటుంది ఈ భామ తీరు. ఎప్పుడూ తన డ్రెస్సులతో ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రకారుకు సెగలురేపే ఈ బ్యూటీ.. తాజాగా మరో కొత్త డ్రెస్సులో కనిపించింది. అయతే ఈ సారి కనిపించిన డ్రెస్ కాస్త డిఫరెంట్ గా ఉండడం విశేషం.
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తొలి సినిమా “ధఢక్”తో నిరాశపరిచిన ఈ భామ.. ఆ తర్వాతా తీసిన సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎన్టీఆర్ 30” సినిమా ద్వారా తొలి సారి తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జాన్వీ కపూర్ సరికొత్త డ్రెస్సులో మెరిసింది. తాజాగా ధరించిన గ్రీన్ డ్రెస్సులో చాలా అందంగా కనిపించిన జాన్వీ.. డ్రెస్ కాస్త ఇబ్బంది కలిగించడంతో.. కింద వరకు ఉన్న ఈ డ్రెస్ లో నడవడానికి ఇబ్బందిగా ఉండేసరికి డ్రెస్ ని కాస్త లుంగీలా చుట్టుకున్నట్టు కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. ప్రతిసారి ఎక్స్ పోజింగ్ చేస్తూ కనిపించే ఈ బ్యూటీ ఈ సారి మొత్తం కప్పేసుకుంది, అనుకునేసరికి లుంగీలా డ్రెస్ చుట్టడం కాస్త నవ్వు తెప్పించింది. మరి నిజంగా డ్రెస్ ఇబ్బందిగా ఉందో లేకపోతే కావాలనే ఇలా చేసిందో ఈ అమ్మడికే తెలియాలి. మొత్తానికి సినిమాలతో పని లేకుండా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది ఈ అమ్మడు. మరి ఈ డ్రెస్సులో జాన్వీ కపూర్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.