జల్సా.. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా చెప్పొచ్చు. ఖుషీ మూవీ తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు పవన్ కు సరైన హిట్ లేదు. ఆ సమయంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో పవన్ లో ఉన్న కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్ తో అభిమానులకు త్రివిక్రమ్ ఫుల్ మీల్స్ పెట్టేశాడు. బ్రహ్మానందంతో నడిచే ట్రాక్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.
ఇప్పుడు అలాంటి ఒక సినిమాని మరోసారి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వెండితెరపై 4కే క్వాలిటీతో చూడనున్నారు. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా జల్సా సినిమా స్పెషల్ షోస్ వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టికెట్లన్నీ అమ్మడైపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ షోల ద్వారా వచ్చే కలెక్షన్స్ ను ఛారిటీకి వినియోగించనున్నట్లు చెబుతున్నారు.
ఈసినిమాకి సంబంధించి గీతా ఆర్ట్స్ ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం అది యూట్యూబ్‌లో వైరల్ గా మారింది. మహేశ్ బాబు వాయిస్ ఓవర్తో ట్రైలర్ ఓపెన్ చేయడం, పవన్ క్యారెక్టర్ గురించి మహేశ్ బాబు వివరించడం ట్రైలర్ మొత్తం ఎంతో కొత్తగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి.. జల్సా కొత్త ట్రైలర్ ను చూసేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.