ప్రస్తుతం ఇండియా మొత్తం కేజీఎఫ్ మానియాలో మునిగిపోయి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే కేజీఎఫ్ ఈ స్థాయిలో విజయం సాధించడానికి కారణం ఆ సినిమా కథనం, ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం. “తల్లికి ఇచ్చిన మాట కోసం రాకీ.. ఓ సామ్రాజ్యానే స్థాపించాలనే ఆకాంక్షతో కేజీఎఫ్ లోకి అడుగుపెట్టి.. అనతికాలంలోనే కేజీఎఫ్ కే కింగ్ అవుతాడు”.. ఇది రీల్ హీరో రాకీ భాయ్ కథ.. అయితే రియల్ లైఫ్ లోను ఓ రాకీ భాయ్ ఉన్నాడు. అందరు అతడిని థంగం రౌడీ అని పిలుస్తుంటారు. కేజీఎఫ్ కథకు ఇతని లైఫ్ స్టోరి దగ్గరా ఉంటుందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం. మరి..రియల్ రాకీ భాయ్ థంగం రౌడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1990ల్లో కరడుకట్టిన నేరస్థుల్లో థంగం ఒకరు. కర్ణాటకలోని కోలార్‌లో పనిచేసే ఆయన గ్యాంగ్.. భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకెళ్లేది. అందుకే ఆయన్ను జూనియర్ వీరప్పన్ గా అక్కడి వారు పిలిచేవారు. 1997లో ఆయనపై ఇండియా టుడే.. ప్రచురించిన ఓ కథనంలో 25ఏళ్ల థంగం.. బంగారం దోపిడీలకు పెట్టింది పేరు అని పేర్కొన్నారు. కేవలం నాలుగేళ్ల సమయంలోనే థంగంపై 42 దోపిడీ కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రజల్లో థంగంకు మంచి మద్దతు ఉండేది. దొంగతనం చేసిన బంగారాన్ని ఆయన ప్రజలకు పంచినట్లు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కనిపిస్తే కాల్చి చంపేయాలని షూటింగ్ ఆర్డర్స్ కూడా ఆయనపై జారీ అయ్యాయి. చివరికి 1997లో పోలీసులతో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో థంగం మరణించాడు.
అయితే థంగం రౌడీని స్ఫూర్తిగా తీసుకొని కేజీఎఫ్ సినిమాను తీశారా? అని ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే, ఆ ప్రశ్నలను ప్రశాంత్ ఖండించారు. కేజీఎఫ్ రాకీ భాయ్ కథ పూర్తిగా కల్పితమని ప్రశాంత్ నీల్ చెప్పారు. మరోవైపు కేజీఎఫ్ సినిమాపై థంగం రౌడీ తల్లి కోర్టులో ఓ కేసు వేశారు. తన కొడుకు పాత్రను సినిమాలో నెగిటివ్‌గా చూపించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.