బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. చాలా ఏళ్ళ తర్వాత ‘పఠాన్’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. చెన్నైఎక్స్‌ప్రెస్ విడుదలైన పదేళ్లకు ‘పఠాన్‘ తో ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పఠాన్ కి ముందు చాలా సినిమాలు చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా ప్రొడ్యూసర్ గా కూడా నష్టాలను చవిచూశాడు. ఈ క్రమంలో కొడితే యాక్షన్ మూవీతో కొట్టాలని సిద్ధార్థ్ ఆనంద్, ఆదిత్య చోప్రా కాంబినేషన్ లో ‘పఠాన్’ చేశాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విడుదలైన పఠాన్.. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకునేసరికి.. కలెక్షన్స్ పరంగానూ అద్భుతాలు సృష్టిస్తోంది.
ఇక హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో విడుదలైన పఠాన్ మూవీ.. రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ దాటి.. షారుఖ్ స్టామినా ప్రూవ్ చేసింది. ఫస్ట్ డేని మించి రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాగా.. మూడో రోజు కూడా మంచి నెంబర్స్ నమోదు చేసింది. పఠాన్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో మళ్లీ పూర్వ వైభవం మొదలైందని సినీవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. పఠాన్ మూవీ మూడో రోజు నాన్ హాలిడే అయినా.. సాలిడ్ కలెక్షన్స్ రాబట్టే ప్రయత్నం చేసింది. ఏకంగా మూడో రోజుతో పఠాన్.. రూ. 300 కోట్ల క్లబ్ లో చేరింది. రెండు రోజుల్లో రూ. 127 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన పఠాన్.. మూడో రోజు రూ. 150 కోట్లకు పైగా నెట్ ని క్రాస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్ లో కేజీఎఫ్-2 పేరిట ఉన్న మూడు రోజుల కలెక్షన్స్ రికార్డు రూ.140.50 కోట్ల నెట్ ని.. ఇప్పుడు పఠాన్ రూ.165 కోట్లు దాటి ఆ రికార్డు ని కొల్లగొట్టింది. అదీగాక మరో రెండు వీకెండ్ డేస్.. శనివారం, ఆదివారం పఠాన్ కి ప్లస్ కాబోతున్నాయి. ఓవరాల్ గా పఠాన్ వీకెండ్ వరకు రూ. 400 కోట్లు ఈజీగా బ్రేక్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ కాగా.. జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరో క్రేజీ రోల్ లో మెరిశాడు. ఈ సినిమా రూ. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ. 165 కోట్లకు పైగా వసూల్ చేసింది కాబట్టి.. ఎండింగ్ వరకూ ఎక్కువ మొత్తం లాభాల్ని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి పఠాన్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Pathaan crosses ₹ 300 Crs Gross at the WW Box office in 3 days.. 🔥
— Ramesh Bala (@rameshlaus) January 28, 2023
#Pathaan is having a RECORD-SMASHING run… Day 3 [working day after big holiday] is EXCEPTIONAL… Will FLY on Day 4-5 [Sat-Sun]… Will cross ₹ 200 cr on Day 4 [Sat], ₹ 250 cr on Day 5 [Sun]… Wed 55 cr, Thu 68 cr, Fri 38 cr. Total: ₹ 161 cr. #Hindi version. #India biz. pic.twitter.com/YUo2dKtKVA
— taran adarsh (@taran_adarsh) January 28, 2023