రోజురోజుకూ ఎన్నో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. వీటిలో జనాదరణ పొందేవి రెండు రకాలు. ఒకటి కంటెంట్ మీద నడిచేవి.. రెండు హీరో - డైరెక్టర్ లేదా ఆ సినిమాకున్న క్రేజ్ పరంగా నడిచేవి. కానీ.. కంటెంట్ ఉన్న సినిమాలకు రావాల్సిన క్రేజ్ కంటే.. ఎక్కువ క్రేజ్, కలెక్షన్స్ మాస్ సినిమాలకు వస్తుంటుంది. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. ఇలాంటి తరుణంలో.. 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా.. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన KGF 2 సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.
చిత్రపరిశ్రమలో రోజురోజుకూ ఎన్నో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. వీటిలో జనాదరణ పొందేవి రెండు రకాలు. ఒకటి కంటెంట్ మీద నడిచేవి.. రెండు హీరో – డైరెక్టర్ లేదా ఆ సినిమాకున్న క్రేజ్ పరంగా నడిచేవి. ఈ రెండు రకాల సినిమాలు గట్టిగానే ఆడతాయి. కానీ.. కంటెంట్ ఉన్న సినిమాలకు రావాల్సిన క్రేజ్ కంటే.. ఎక్కువ క్రేజ్, కలెక్షన్స్ మాస్ సినిమాలకు వస్తుంటుంది. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కంటెంట్ నచ్చినా.. మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ నచ్చినా.. డైరెక్ట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలను సైతం విశేషంగా ఆదరిస్తుంటారు. ఆ విషయంలో నో డౌట్.
తెలుగులో కూడా ఈ మధ్య బెటర్ కథలు, కొత్త కథలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు యంగ్ డైరెక్టర్స్. ఇది ఎవరైతే విభిన్నమైన కథాంశాలను ట్రై చేస్తున్నారో ఆయా దర్శకులను ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఈ మధ్య అన్ని రకాల సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేష్ మహా.. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన KGF 2 సినిమాపై.. పేరు చెప్పకుండా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆ డైరెక్టర్ కామెంట్స్ ని తప్పుబడుతూ.. నెటిజన్స్, సినిమా లవర్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వెంకటేష్.. అతనితో పాటు మరో నలుగురు దర్శకులు కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ మాట్లాడుతూ.. “ప్రపంచంలో ఓ తల్లి ఓ కొడుకుని.. నువ్వు ఎప్పటికైనా గొప్పోడివి అవ్వరా, గొప్పోడు అంటే ఆమె దృష్టిలో బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడు అని. ఈ విషయంలో నాకు ఒక ప్రశ్న ఉంది, ఈ తల్లి ఏమి చెబుతుంది అంటే తనకు అంత గోల్డ్ కావాలి అని అంటుంది. ఆ గోల్డ్ ని తవ్వి తోడేవాళ్లు కొందరుంటారు. వీడు(హీరో) వెళ్లి వాళ్ళను ఉద్ధరిస్తాడు. తర్వాత ఓ పాట కూడా వస్తుంది. లాస్ట్ లో వీడు పెద్ద మొత్తంలో గోల్డ్ పోగేస్తాడు.
ఎప్పుడైనా నిజంగా అలాంటి తల్లి ఎవరైనా ఉంటే నాకు ఆ మహాతల్లిని కలవాలని ఉంటుంది. ఆడు ఎంత నీచ్ కమీన్ కుత్తే కాకపోతే అంతా తీసుకెళ్లి లాస్టులో ఎక్కడో పార దొబ్బుతాడు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి చెబితే.. ఆడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా? అలాంటి కథలను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది మీరు అనుకుంటున్న సినిమా కాదు” అంటూ కామెంట్స్ చేశాడు. అయితే.. డైరెక్టర్ వెంకటేష్ ఎక్కడా కూడా హీరో పేరు, దర్శకుడి పేరు, సినిమా పేర్లను మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ.. అతను చెప్పిన స్టోరీ లైన్.. కేజీఎఫ్ 2 సినిమా గురించే అని ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి.
ఈ క్రమంలో వెంకటేష్ మరింత మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలో ఉన్న ఐదుగురు డైరెక్టర్స్ తమ క్రెడిబిలిటీని పక్కన పెట్టి.. తాము కూడా పెన్ను బదులు కత్తి పట్టే సినిమాలు తీసి.. వాళ్ళకంటే పెద్ద హిట్స్ కొట్టగలమని కామెంట్స్ చేశాడు. దీంతో మరీ ఇంత టార్గెట్ చేసి మాట్లాడటం అవసరమా అనే విధంగా వెంకటేష్ మాటలు ప్రెజెంట్ చర్చలకు దారి తీస్తున్నాయి. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న వెంకటేష్.. కన్నడ సినిమా సత్తా చూపించిన కేజీఎఫ్ 2ని ఇలా దారుణంగా విమర్శించడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎప్పుడో వచ్చిన సినిమా గురించి ఇప్పుడెందుకు అంతలా కామెంట్స్ చేయడమని అంటున్నారు నెటిజన్స్. డైరెక్టర్ వెంకటేష్ మాటలు మున్ముందు ఎలాంటి చర్చలకు దారి తీయనున్నాయో చూడాలి! ఇక వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
— Subbu (@subbu2456) March 5, 2023Venkatesh Maha