ఎవరికైనా సినిమాలు నచ్చనప్పుడు.. 'ఆ సినిమాలు నచ్చలేదు' అని చెప్పడానికి చాలా మార్గాలుంటాయి. ఒకటి నచ్చకపోతే.. వాటి గురించి మాట్లాడే అవసరం లేదు.. ఎందుకంటే ఆ సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయం. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒక విషయాన్నీ నచ్చలేదు అని చెప్పాలనుకుంటే.. పద్ధతిగా చెప్పవచ్చు. లేదు.. మాకు నోరుంది.. ఇన్నాళ్లు దాచుకున్న విమర్శలన్నీ.. నోటికొచ్చినంత బూతులతో కలిపి విమర్శిస్తే.. ఖచ్చితంగా సీరియస్ పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా ఎవరికైనా సినిమాలు నచ్చనప్పుడు.. ‘ఆ సినిమాలు నచ్చలేదు’ అని చెప్పడానికి చాలా మార్గాలుంటాయి. ఒకటి నచ్చకపోతే.. వాటి గురించి మాట్లాడే అవసరం లేదు.. ఎందుకంటే ఆ సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయం. సో.. చెప్పకుండా సైలెంట్ గా ఉండొచ్చు. లేదు.. మేము మా ఒపీనియన్ చెప్పే తీరాలి అనుకున్నప్పుడు.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ‘మాకు ఆ సినిమా నచ్చలేదు’ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. పర్లేదు.. మీకు నచ్చని సినిమాని నచ్చలేదు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ.. సినిమా నచ్చకపోతే.. నచ్చనట్లు ఉండకుండా.. కెమెరా ముందు ఇష్టం వచ్చినట్లు దారుణంగా కామెంట్స్ చేస్తే అది పద్దతి కాదు.
ఇది ఎవరి విషయంలోనైనా వర్తిస్తుంది. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒక విషయాన్నీ నచ్చలేదు అని చెప్పాలనుకుంటే.. పద్ధతిగా చెప్పవచ్చు. లేదు.. మాకు నోరుంది.. ఇన్నాళ్లు దాచుకున్న విమర్శలన్నీ.. నోటికొచ్చినంత బూతులతో కలిపి విమర్శిస్తే.. ఖచ్చితంగా సీరియస్ పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా.. పేరు చెప్పకుండా, డైరెక్ట్ గానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘KGF 2’ మూవీపై దారుణమైన కామెంట్స్ చేశాడు. నీచ్ కమీన్ కుత్తే.. అంటూ కేజీఎఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని ఇష్టం వచ్చినట్లు విమర్శలు గుప్పించాడు. దీంతో కేజీఎఫ్ మూవీ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్, కామన్ ఆడియెన్స్ వెంకటేష్ మహాపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేష్ మహా.. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన KGF 2 సినిమాపై.. పేరు చెప్పకుండా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వెంకటేష్ మాట్లాడుతూ.. “ప్రపంచంలో ఓ తల్లి తన కొడుకుని.. నువ్వు ఎప్పటికైనా గొప్పోడివి అవ్వరా అంటే.. గొప్పోడు అంటే ఆమె దృష్టిలో బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడు అని. ఇక్కడ నాకో ప్రశ్న ఉంది. ఏంటంటే.. ఆ తల్లి తనకు ఇంత మొత్తంలో బంగారం కావాలని అంటుంది. ఆ బంగారాన్ని తవ్వి తోడేవాళ్లు కొందరు. వాళ్ళను ఉద్దరించేవాడు ఒకడు(హీరో). తర్వాత ఓ పాట వస్తుంది. చివరికి వీడు(హీరో) పెద్ద మొత్తంలో గోల్డ్ పోగేస్తాడు. నిజంగా అలాంటి తల్లి ఎవరైనా ఉంటే నాకు ఆ మహాతల్లిని కలవాలని ఉంటుంది.
ఆడు(హీరో) ఎంత నీచ్ కమీన్ కుత్తే కాకపోతే.. అంతా తీసుకెళ్లి ఎక్కడో పార దొబ్బుతాడు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి చెబితే.. ఆడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా? అలాంటి కథలను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది మీరు అనుకుంటున్న సినిమా గురించి కాదు నేనంటుంది” అని అన్నాడు. అంతేగాక.. తమ క్రెడిబిలిటీని పక్కన పెట్టి.. తాము కూడా పెన్ను బదులు కత్తి పట్టే సినిమాలు తీసి.. వాళ్ళకంటే బాబు లాంటి హిట్స్ కొట్టగలమని అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు నీకు సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పకుండా ఇలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ తో కామెంట్స్ చేయడం ఏంటంటూ.. నెటిజన్స్ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
వెంకటేష్ మహా ఇప్పటిదాకా చేసింది రెండు సినిమాలే. ఒకటి కేరాఫ్ కంచరపాలెం, రెండు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. తీసింది రెండు సినిమాలే అయినా.. మంచి పేరైతే తెచ్చుకోగలిగాడు. కానీ.. ఇప్పుడు కేజీఎఫ్ 2 పై దారుణంగా కామెంట్స్ చేసి తీవ్ర విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. కేజీఎఫ్ 2కి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల చరిత్ర ఉంది. అది కన్నడ సినిమా సత్తాని ప్రపంచానికి ప్రూవ్ చేసిన సినిమా కేజీఎఫ్ 2. దీంతో ఇప్పుడు వెంకటేష్ పై నెటిజన్స్, మూవీ లవర్స్ రియాక్ట్ అవుతూ.. రికార్డులు తిరగరాసిన కేజీఎఫ్ సినిమాపై నువ్వు కామెంట్స్ చేయడం ఏంట్రా.. తీసింది బొక్కలో రెండు సినిమాలు. అందులో ఒకటి రీమేక్.
ముందు నీ పనేదో నువ్వు చూసుకోకుండా ఇలా.. ఒక ఇండస్ట్రీ హిట్ సినిమాపై నోటికి ఎంతొస్తే అంత మాటలు జారుతావా? అది మాస్ సినిమా. మాస్ ఆడియెన్స్ మెచ్చిన సినిమా. అది అలాగే ఉంటుంది. నువ్వెవడివి అసలు కేజీఎఫ్ ని కామెంట్ చేయడానికి. నీచ్ కమిన్ కుత్తే అన్నావ్.. రెండు సినిమాలకే నీకంత బలుపా? సినిమాలపై అభిప్రాయాలు చెప్పడానికి ఓ పద్దతి ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి.. ఆ స్థాయిలో హేళన చేస్తూ.. బూతులు వాడాల్సిన అవసరం ఏముంది? అంటున్నారు అంటున్నారు. సినిమాపై క్రిటిసిజమ్ తప్పులేదు. కానీ.. బండ బూతులు వాడటం అనేది పెద్ద తప్పు అని మూవీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కేజీఎఫ్ గురించి డైరెక్టర్ వెంకటేష్ చేసిన విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలపండి.
veedu tessina musthi 2 cinemalu intha bulupu ra bsdk?? @mahaisnotanoun https://t.co/A0FTRXCLjF
— ArjunDass (@ARjUNDaass) March 6, 2023