యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ తెగ బిజీగా మారిపోయాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన రాధేశ్యామ్ మూవీ బోల్తా కొట్డిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ ఆలోచనలో పడ్డాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ డిజాస్టార్ గా మిగిలిపోవడం తీవ్ర నిరాశకు గురి చేయడం విశేషం.
ఇదిలా ఉంటే ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలే ఉన్నాయి. సలార్, ఆదిపురుష్, స్పిరిట్ వంటి సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు చిత్ర యూనిట్స్. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ చేస్తున్న విషయం తెలతిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. గతంలో కొంతమంది హీరోయిన్ల పేరు వినిపించగా తాజాగా మరో ఇద్దరి హీరోయిన్ల పేర్లు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారతున్నాయి.
ఇది కూడా చదవండి: SVP Trolls: సర్కారు వారి పాటకి ప్లాప్ టాక్ రావడానికి కారణం వాళ్లే : వైసీపీ నేత వెంకట్ రెడ్డిఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా రష్మిక లేక కియారాను ఎంపిక చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సందీప్ వీరిద్దరిలో ఒకరిని ఫైనల్ చేసుకునే పనిలో పడ్డాడట. సందీప్ ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ చిత్రంలో బిజీగా ఉన్నాడు. మరి వీరిద్దరిలో రష్మికనా లేదంటే కియారా వీరిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారనేది ఇంకా పూర్తిగా క్లారిటీ మాత్రం లేదు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.