ఎన్టీఆర్ 30కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడా విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ 30లో..
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఎన్టీఆర్ 30’ని వర్కింగ్ టైటిల్‌గా ఉంచారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం జూ.ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక, ఎన్టీఆర్ 30కి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో జూనియర్ పాత్రకు సంబంధించిన ఆ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ సంగతేంటంటే.. జూ. ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారట.
యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లోని హీరో రెండు పాత్రలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా ఉండబోతున్నాయట. జూనియర్ ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల పాత్రల మధ్య చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారట. ఇక, గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేశారు. నా అల్లుడు, ఆంధ్రావాలా సినిమాల్లో ద్విపాత్రాభినయం.. జైలవకుశ సినిమాలో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. అయితే, ద్విపాత్రాభినయం చేసిన రెండు సినిమాలు ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు.
బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు డ్యూయల్ రోల్స్ కలిసొస్తాయా అన్న భయాన్ని అభిమానులు వ్యక్త పరుస్తున్నారు. కాగా, కొరటాల శివ.. జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ఇది వరకే ఓ సినిమా వచ్చింది. జనతా గ్యారెజ్ సినిమాతో ఓ కొత్త ఎన్టీఆర్‌ను శివ పరిచయం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సూపర్ హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావటంతో అంచనాలు హైలో ఉన్నాయి. మరి, ఎన్టీఆర్ 30లో జూనియర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.