పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘తొలిప్రేమ’ సినిమా చాలా స్పెషల్. కరుణాకరన్ అనే తమిళ కుర్రాడిని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు పవన్. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తర్వాత చాలా సార్లు రీరిలీజ్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘తొలిప్రేమ’ సినిమా చాలా స్పెషల్. కరుణాకరన్ అనే తమిళ కుర్రాడిని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు పవన్. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తర్వాత చాలా సార్లు రీరిలీజ్ అయ్యింది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల 4K క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో రీరిలీజ్ చేస్తే సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పవన్ – కీర్తి రెడ్డిల లవ్ ట్రాక్, కెమిస్ట్రీ, కామెడీ, ఎమోషనల్ సీన్స్, సాంగ్స్.. ఇలా చెప్పుకుంటూపోతే సినిమాలో ప్రతీ అంశం హైలెట్టే. పవన్, అభిమానులకు కూడా ‘తొలిప్రేమ’ మెమరబుల్ మూవీ.
ఆలీ, వేణు మాధవ్ తదితరులు పవన్ ఫ్రెండ్స్‌గా కనిపించారు. ఆ గ్యాంగ్‌లో నల్లగా ఉండే బొగ్గు శ్రీను క్యారెక్టర్ చేసిన జగన్ బాగా పాపులర్ అయ్యాడు. అతడు నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. ప్రారంభంలోనే ఏకంగా డీఎస్పీ కూతురుకి లవ్ లెటర్ ఇచ్చి, వాళ్లొచ్చి ఎక్కడ కొడతారోనని భయపడి దాక్కోవడం, అమ్మాయి కూడా లవ్ చేస్తున్నట్లు చెప్పగానే సాంగ్ లీడ్ తనతోనే స్టార్ట్ అవడం.. ఇలా మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరే ఇచ్చాడు డైరెక్టర్. ఇంతకీ జగన్ ఎవరంటే.. కరుణాకరన్‌కి బాగా కావలసిన వ్యక్తి అట.
చెన్నైలో తను సినిమా ప్రయత్నాల్లో ఉండగా జగన్ సాయం చేశాడట. అప్పుడే తను డైరెక్టర్ అయితే ఫస్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడట. ఇచ్చిన మాట ప్రకారం ‘తొలిప్రేమ’ లో మంచి వేషం ఇచ్చాడు. ఫస్ట్ ఫిలింతోనే మంచి గుర్తింపు వచ్చినా కానీ జగన్ ఆ తర్వాత నటించలేదు. తను మద్రాసులోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. సినిమాల్లో కమెడియన్‌గా స్టార్‌డమ్ తెచ్చుకునే అవకాశమున్నప్పటికీ ఆయన తన ఉద్యోగానికే ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఇక కరుణాకరన్ తమిళనాడు వ్యక్తి అయినా తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇది కూడా చదవండి: ఈ ‘పోకిరి’ బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూశారా!