టిక్‌టాక్ తర్వాత సోషల్ మీడియాను ఏలుతున్న సార్ట్ వీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. ఎంతోమంది ఇందులో తమతమ టాలెంట్‌ను వీడియో రూపంలో బయటపెడుతుంటారు. వారికి ఫాలోవర్లు కూడా వేల సంఖ్యలో ఉంటారు. వారు చేసే వీడియోలకు పిచ్చి అభిమానులు ఉంటారు. అలా 4.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్న సోఫియా వీడియో చేస్తే లైకులు లక్షల్లో పడిపోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు అంత క్రేజ్. sofia9__official అనే పేజ్ ఆమెది. గతంలో టిక్‌టాక్‌లో వీడియోలు చేసే సోఫియా అది బ్యాన్ అవ్వడంతో రీల్స్ చేస్తున్నారు. ఆమె వీడియోలు కుర్రకారు మతి పోగొడుతుంటాయి. సోఫియా పూర్తి పేరు సోఫియా అన్సారీ, గుజరాత్‌లో పుట్టిపెరిగి, ముంబైలో నివాసముంటుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటన వైపు అడుగులేస్తోంది.