సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ద్వారా కొంతమంది ఒక్క రాత్రిలో సెలబ్రిటీలుగా మారిపోయారు. తాజాగా మరో అమ్మాయి సోషల్ మీడియా స్టార్ గా మారిపోయి.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఆ అమ్మాయి పేరు కీర్తి సిరి. అదేనండి దసరా మూవీలోని 'చమ్కీల అంగిలేసి' పాటకు కళ్లద్దాలు పెట్టుకుని కార్లో రీల్ చేసిన అమ్మాయి.
కరోనా సమయం నుంచి సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా వాడకంలోకి రావడంతో.. కొంత మంది రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్లు అయిపోయారు, అవుతున్నారు. వారిలో టిక్ స్టార్ దుర్గారావు, అషు రెడ్డి, ఆవేశం స్టార్, జబర్దస్త్ భాను లాంటి మరికొంత మంది ఉన్నారు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ద్వారా వీరందరు ఒక్క రాత్రిలో సెలబ్రిటీలుగా మారిపోయారు. తాజాగా మరో అమ్మాయి సోషల్ మీడియా స్టార్ గా మారిపోయి.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఆ అమ్మాయి పేరు కీర్తి సిరి. అదేనండి దసరా మూవీలోని ‘చమ్కీల అంగిలేసి’ పాటకు కళ్లద్దాలు పెట్టుకుని కార్లో రీల్ చేసిన అమ్మాయి.
కీర్తి సిరి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పేరే వినిపిస్తోంది. మీమ్స్ పేజీల్లో, ఇన్ స్టాతో పాటుగా మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లల్లో తెగ వైరల్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. దానికి కారణం ఒకే ఒక్క రీల్ వీడియో. ఈ ఒక్క రీల్ వీడియోతో కీర్తి ఇన్ స్టా ఫాలోవర్స్ ఏ రేంజ్ లో పెరిగిపోయారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. తాజాగా కీర్తి కార్లో వెళ్తూ.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా మూవీలోని చమ్కీల అంగిలేసి అనే పాటకు రీల్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన ఈ రీల్ వీడియో సోషల్ మీడీయాను షేక్ చేస్తోంది.
ఇక కీర్తి చేసిన ఈ వీడియోను సీనియర్ దివంగత కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం వేసిన ఓ స్టెప్ తో కంపేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో మీమ్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దాంతో కీర్తికి విపరీతంగా ఫాలోయింగ్ పెరిపోతోంది. ఈ రీల్ చెయ్యక ముందు ఇన్ స్టాలో ఆమె ఫాలోవర్స్ 3వేలు ఉన్నారు. ఎప్పుడైతే చమ్కీల అంగిలేసి పాటకు రీల్ చేసిందో.. అప్పటి నుంచి ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఓవర్ నైట్ లో ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ 68.8Kకి పెరిగిపోయారు. దాంతో ఈ అమ్మడు సంతోషంతో గంతులేస్తోంది. అయితే స్వతహగానే కీర్తి డ్యాన్సర్.. అదీకాక ఈమె కిట్టమ్మ అనే ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తోంది. అందులో తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ స్టార్ గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా ఈ ఒక్క రీల్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది కీర్తి సిరి.