సోషల్ మీడియా వల్ల చాలామంది ఫేమస్ అయిపోతున్నారు. అలా టిక్ టాక్ ద్వారా తెలుగు స్టేట్స్ లో క్రేజ్ తెచ్చుకున్న వారిలో భాను ఒకరు. టిక్ టాక్ లో ఈమె వీడియోలపై తొలుత బాగా ట్రోలింగ్ జరిగింది. అది ఆమెకి ప్లస్ అయింది. దీంతో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా కాస్త ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమెకి ఇన్ స్టాలో 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే స్టేజీపై తన లవ్ స్టోరీ గురించి తొలిసారి రివీల్ చేసి, అందరికీ షాకిచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన భానుని.. హైపర్ ఆది ‘జబర్దస్త్’ షోలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో పలు స్కిట్లు, డ్యాన్స్ ఫెర్ఫామెన్సులు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లపాటు ఈ షోలో కనిపించలేదు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజీపై సందడి చేసింది. వర్షతో కలిసి అదిరిపోయే పాటకు హాట్ హాట్ గా డ్యాన్స్ కూడా చేసి నెటిజన్స్ ఫుల్ కిక్కిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోని నెటిజన్స్ తెగ చూసేస్తున్నారు.
ఈ ఆదివారం ‘అమ్మ నా కోడలా’ పేరుతో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులోనే ఓ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి భాను బయటపెట్టింది. ఎనిమిదేళ్లుగా ఓ వ్యక్తిని ఇష్టపడుతున్నానని, కానీ ఆ విషయం తన అమ్మనాన్నలకు తెలియదని కూడా చెప్పింది. మరి భాను లవ్ చేస్తున్న పర్సన్ ఎవరు? ఏంటనేది తెలియాలంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. భాను ఎవరినీ లవ్ చేస్తుందని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ భాను శ్రీ! వరుడు ఎవరంటే?