టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ అనగానే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్.. ఇలా చాలామంది హీరోల పేర్లు చెబుతారు. అదే హీరోయిన్ల పేర్లు చెప్పండి అంటే మాత్రం ఒక్క నిమిషం తటపటాయిస్తారు. ఎందుకంటే హీరోలతో పోటీపడి స్టెప్స్ చేయాలంటే పక్కా డ్యాన్సర్ అయ్యుండాలి. లేకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఇక తెలుగులో చేసిన హీరోయిన్స్ లో బెస్ట్ అనే ప్రస్తావన వచ్చిన కొన్నిసార్లు తమన్నా గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇకపోతే ఆమె మాస్ డ్యాన్స్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పటికే బిజీగానే ఉంది. మంచు మనోజ్ హీరోగా చేసిన ‘శ్రీ’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ‘హ్యాపీడేస్’తో ఫుల్ గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే పెద్ద హీరోలతో ఛాన్సులు దక్కించుకోవడానికి మాత్రం చాలా టైం పట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘100 % లవ్’లో ఎప్పుడైతే తమన్నా హీరోయిన్ గా చేసిందో.. అక్కడ నుంచి ఆమె లైఫ్ మారిపోయింది. దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించింది.
ఈ ఏడాది ‘గని’లో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ‘ఎఫ్ 3’లో హీరోయిన్ గా చేసింది. రీసెంట్ గా ‘బబ్లీ బౌన్సర్’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ తదితర హిందీ సినిమాలతో డైరెక్ట్ గా ఓటీటీలో ప్రేక్షకులని పలకరించింది. ఇక తాజాగా చెన్నైలో ‘మెటా క్రియేటర్స్ డే’ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అటెండ్ అయిన తమన్నా.. తళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో ‘వాతీ కమింగ్’ సాంగ్ కి మాస్ స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ వేడుకకు హాజరైన ఓ నెటిజన్.. తమన్నా డ్యాన్స్ ని వీడియోగా తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది ఫ్యాన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.
.@tamannaahspeaks Vibes for #vaathicoming at #Metacreatorday event at Chennai. pic.twitter.com/lPuZn7ON4F
— Abєєѕ (@AbeesVJ) October 27, 2022