హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఓ ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె జీవిత భాగస్వామి గురుంచి ఓ క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే?
హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవన్ 2.0 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గూఢాచారి, మేజర్ వంటి చిత్రాల్లోనటించి తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య యంగ్ హీరో నాగచైతన్యతో శోభితా డేటింగ్ లో ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడు పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఇకపోతే, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్-2. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ప్రమోషన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పకొచ్చింది.
హీరోయిన్ శోభితా మాట్లాడుతూ… జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కలిగి ఉండాలి. నలుగురికి సహాయం చేసే మంచి మనసు ఉండాలి. ప్రకృతిని ఎక్కువగా ప్రేమించాలి. సేవ గుణం కలిగి ఉండాలి. ఎప్పుడూ సంప్లిసిటీని మెయింటెన్ చేస్తూ ఉండాలి. జీవితం చాలా చిన్నదని తెలుసుకుని ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ బాగా ఎంజాయ్ చేయాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి నాకు భర్తగా రావాలని కోరుకుంటున్నానంటూ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది. ఇక ఇదే కాకుండా ఇటీవల ఆమెపై వచ్చిన రూమార్స్ పై కూడా స్పందించారు. ఇలాంటి వాటికి నేను అస్సలు బాధపడనంటూ తెలిపారు.