ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య.. తమ సినిమాలతో హిట్స్ కొట్టేశారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ నటించిన హీరోయిన్ ఒక్కతే. ఆమెనే శ్రుతిహాసన్. పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు కాకపోయినప్పటికీ.. హీరోయిన్ గా ఓకే అనిపించింది. సినిమాల గురించి కాస్త పక్కనబెడితే.. ఈమె వ్యక్తిగతంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే అతడి గురించి ఓ ఎమెషనల్ పోస్ట్ పెట్టింది.
ఇక విషయానికొస్తే.. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా శ్రుతిహాసన్ అందరికీ తెలుసు. సింగర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో హీరోయిన్ గా మారింది. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తో స్టార్ హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఓ దశలో శ్రుతిహాసన్ కెరీర్ అయిపోయిందనుకున్నారు. కానీ ‘క్రాక్’తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఇక ఈ సంక్రాంతికి రిలీజైన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు ‘సలార్’లో హీరోయిన్ గా చేస్తున్న శ్రుతిహాసన్.. మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ నటించేందుకు చర్చలు జరుపుతోంది. ఇకపోతే తన బాయ్ ఫ్రెండ్ శాంతను గురించి తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవరూ చూసుకోలేరు’ అని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక చాలారోజుల తర్వాత శ్రుతిహాసన్ ఈ పోస్ట్ పెట్టడంతో అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరే ఇదంతా పక్కనబెడితే.. పండక్కి వచ్చిన సినిమాల్లో శ్రుతిహాసన్ యాక్టింగ్ ఎలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.