సాధారణంగా హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తుంటారు. ఈమె మాత్రం యాక్టింగ్ తోపాటు డ్యాన్స్ తోనూ అదరగొట్టేస్తూ ఉంటుంది. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మీకు దిమ్మతిరిగిపోవడం గ్యారంటీ.
మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఈమె చాలా అంటే చాలా డిఫరెంట్. ఫాస్ట్ గా సినిమాలు చేసేయాలని తొందర అస్సలు లేదు. చేసిన మూవీస్ లోనూ ఎక్స్ పోజింగ్ అనే మాటే వినిపించదు. అనుకోకుండా హీరోయిన్ అయినప్పటికీ.. కలలో కూడా ఊహించని సక్సెస్ అందుకుంది. నటిగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. చదువుని వదిలేయలేదు. డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసింది. సాయిబాబా అంటే ఈమెకు చాలా భక్తి. తెలుగులో ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న పెద్ద పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ గిరిజన తెగలో పుట్టింది. తండ్రి సెంట్రల్ గవర్నమెంట్. చిన్నప్పుటి నుంచి ఈమెకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కస్తూరిమాన్, ధామ్ ధూం సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘ఢీ’లో పాల్గొని చాలా పేరు తెచ్చుకుంది. ఈమెనే సాయిపల్లవి. పైన ఫొటోలో ఈమె, చెల్లిని ఎత్తుకుని ఉంది. డ్యాన్సర్ గా యమ క్రేజ్ సంపాదించిన సాయిపల్లవి.. ‘ప్రేమమ్’ అనే మలయాల మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఫస్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సాయిపల్లవి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘ఫిదా’తో తెలుగులోకి వచ్చిన ఈమె.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ.. ‘శ్యామ్ సింగరాయ్’ ఈమెకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. ‘విరాటపర్వం’, ‘గార్గి’ మూవీస్ తో గతేడాది వచ్చినప్పటికీ హిట్స్ కొట్టలేకపోయింది. ప్రస్తుతానికైతే ఈమె ఏ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో యాక్టింగ్ మానేసిందని అంటున్నారు. కానీ నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈమె డ్యాన్స్ చేసిన రౌడీ బేబీ, వచ్చిండే, సారంగ దరియా సాంగ్స్ అయితే యూట్యూబ్ వ్యూస్ లో రికార్డులు సృష్టించాయి! సరే ఇదంతా పక్కనబెడితే ఈమె చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.