ఆమె చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఓవైపు చదువుకుంటూనే నటిగా చాలా గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి, టీనేజ్ లోనూ నటించింది. ఇక పెద్దయిపోయిన తర్వాత హీరోయిన్ గా బిజీ అయిపోయింది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఈ ఏడాది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో వచ్చింది కానీ హిట్ అయితే కొట్టలేకపోయింది. ప్రస్తుతం నటిగా కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి నివేతా థామస్. చెన్నైలో స్థిరపడిన మలయాళ కుటుంబంలో నివేతా పుట్టింది. తొమ్మిదేళ్ల వయసులోనే ‘మై డియర్ భూతం’ అనే తమిళ టీవీ సీరియల్ లో నటించింది. దీనితోపాటే శివమయం, అరసే, రాజరాజేశ్వరి, తేన్మోయల్ తదితర సీరియల్స్ కూడా చేసింది. ‘వెరుతు ఒరే భార్య’ అనే మలయాళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళ, మలయాళంలో చాలా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘దృశ్యం’ తమిళ రీమేక్ ‘పాపనాశనం’లో కీలకపాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
ఇక నాని ‘జెంటిల్మెన్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నివేతా థామస్.. పూర్తిస్థాయి హీరోయిన్ గా మారిపోయింది. నిన్నుకోరి, జై లవకుశ, 118, బ్రోచెవారెవరా, వి లాంటి సినిమాలు చేసింది. ఇక ‘దర్బార్’లో రజనీకాంత్ కూతురిగా, ‘వకీల్ సాబ్’ పవన్ కల్యాణ్ తో కలిసి నటించి హిట్స్ కొట్టింది. ఈ ఏడాది ‘శాకిని డాకిని’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో వచ్చిన నివేతా.. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం ‘ఎంతడా సాజి’ అనే మలయాళ మూవీలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూనే ఉంటుంది.