ఈ బ్యూటీ పుట్టి పెరిగింది తెలంగాణలోనే. హీరోయిన్ గా పదేళ్ల కెరీర్ ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఒక్క సినిమా కూడా లేదు. సూపర్ గ్లామర్ ఉన్నప్పటికీ డైరెక్టర్సే ఎందుకో గుర్తుంచట్లేదనిపిస్తోంది.
ఈ పాప అచ్చ తెలుగమ్మాయి. ఓ హీరోయిన్ కి ఏమేం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారో అవన్నీ ఉన్నాయి. కానీ ఛాన్సులే ఎందుకో సరిగా రావట్లేదు. వచ్చినా సరే ఈమె సద్వినియోగం చేసుకోలేకపోతుందా అనేది అర్థం కావట్లేదు. పోనీ గ్లామర్ కి ఏమైనా కండీషన్స్ పెడుతుందా అంటే అస్సలు లేదు. అందంగా లేదా అంటే చాలామంది హీరోయిన్ల కంటే సూపర్ గ్లామరస్ గా ఉంటుంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. మరి ఇంతవరకు చెప్పాం కదా ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడేమో గానీ ప్రస్తుత కాలంలో తెలుగమ్మాయిలు హీరోయిన్లు అయింది చాలా తక్కువ. మహా అయితే వేళ్లపై లెక్కపెట్టేంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. వరంగల్ లో పుట్టింది. మోడల్ గా పలు యాడ్స్ లోనూ నటించింది. శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీలో ఓ చిన్న రోల్ లో నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరే ఈషా రెబ్బా. 10 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఈ భామ.. తెలుగుతోపాటు తమిళ, మళయాళ సినిమాల్లోనూ నటించింది.
ఏప్రిల్ 19న ఈమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమె చిన్నప్పటి ఫొటోలు వైరల్ గా మారాయి. ఇషా రెబ్బా కెరీర్ నే చూస్తే.. 2013లో వచ్చిన ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీతో హీరోయిన్ గా మారింది. ‘అమీతుమీ’, అ!, అరవింద సమేత, సవ్యసాచి, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తదితర మూవీస్ చేసింది. తమిళంలో ఓయ్, నీతామ్ ఒరు వాన్ చిత్రాలు.. మలయాళంలో ‘ఒట్టు’ మూవీ చేసింది. ప్రస్తుతం ఓ తమిళ మూవీ చేస్తోంది. తెలుగమ్మాయి, గ్లామరస్ గా ఉన్నప్పటికీ.. ఈమెకి హీరోయిన్ గా టాలీవుడ్ లో సరైన ఛాన్సులు రావట్లేదని చెప్పాలి. దానికి రీజన్ ఏంటనేది బహుశా ఆమెకి కూడా తెలియకపోవచ్చేమో!? సరే ఇదంతా పక్కనబెడితే ఆమె చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.