హీరో సిద్దార్థ్.. ఈ పేరుకు టాలీవుడ్ స్పెషల్ పరిచయం అక్కర్లేదు. తెలుగువాడు కాకపోయినప్పటికీ.. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించాడు. లవర్ బాయ్ పాత్రలకు కేరాఫ్ అయిన మనోడు.. తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నాడు. సినిమాల గురించి పక్కనబెడితే.. హీరో సిద్దార్థ్ తోపాటు అతడి తల్లిదండ్రులకు ఘోర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మధురై విమానశ్రయంలో జరిగిన సంఘటన గురించి చెబుతూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. సిద్ధు, మధురై విమానశ్రయంలో తన తల్లిదండ్రులతో కలిసి ఫ్లైట్ దిగాడు. అయితే బయటకు నడుచుకుంటూ వస్తుండగా.. ఎయిర్ పోర్ట్ లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది వీళ్లను అడ్డుకున్నారు. సిద్ధు తల్లిదండ్రుల జేబులు, బ్యాగుల్లో ఉన్న డబ్బు, ఇతర వస్తువులను బయటకు తీయాలని ఆర్డర్ వేశారు. అంతేకాదు అకారణంగా హిందీలో తిడుతూ వచ్చారు. అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాక.. హీరో సిద్దార్థ్ వారిని ఆపుచేసే ప్రయత్నం చేశాడు. దానితో పాటు హిందీలో కాదు ఇంగ్లీష్ లో మాట్లాడమని అడిగాడు. అయినా సరే తన మాటలు వినకుండా అరుస్తూ గట్టిగట్టిగా మాట్లాడారని సిద్ధు ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు 20 నిమిషాల పాటు తన తల్లిదండ్రులతో పాటు తనని సీఆర్పీఎప్ సిబ్బంది అవమానించారని, తనని వేధింపులకు గురిచేశారని సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఎయిర్ పోర్టులో విధుల్లో ఉన్న సీఆర్ఫీఎఫ్ సిబ్బంది.. ఎలాంటి పనిచేయకుండా తమపై అధికారాన్ని చూపించారని హీరో సిద్దార్థ్, తన పోస్టులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విమానశ్రయంలోని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్న సిద్ధార్థ్.. తెలుగులో సినిమాలు తగ్గించేసి ఇతర భాషల్లో నటించాడు. ప్రస్తుతం కెరీర్ ఓ మాదిరిగా ఉంది. తెలుగులో చివరగా ‘మహాసముద్రం’ సినిమాలో ఓ హీరోగా నటించాడు. ఇందులో తనతో పాటు కలిసి పనిచేసిన అదితిరావ్ హైదరీతో ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. సరే ఇదంతా పక్కనబెట్టేస్తే.. సిద్ధార్థ్ తోపాటు అతడి తల్లిదండ్రులకు ఎయిర్ పోర్ట్ లో జరిగిన అవమానంపై మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#JUSTIN “இந்தியில் பேசக்கூறி காக்க வைப்பு”#Madurai #Airport #CISF #Siddharth #news18tamilnadu https://t.co/7dpn9FD15R pic.twitter.com/iI95OkuxEb
— News18 Tamil Nadu (@News18TamilNadu) December 27, 2022