బుల్లితెరపై వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంటాడు ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్. ఈ మద్య ఇండియన్ సెలబ్రెటీలతో పలు సాహస యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బేర్ గ్రిల్స్ ప్రధాని మోదీతో పాటు పలువురు హీరోలతో కూడా సాహసయాత్రలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ చేరాడు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రణ్‌వీర్‌సింగ్. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా బుల్లితెరపై ఎన్నో యాడ్స్ లో కనిపిస్తుంటాడు. అంతేకాదు వెరైటీ కాస్ట్యూమ్స్ తో ఫోటో షూట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంటాడు. ఎలాంటి హంగూ ఆర్భాటాలకు పోకుండా ఫ్యాన్స్ తో సింపుల్ గా సెల్పీలు దిగుతుంటాడు. ప్రస్తుతం రణవీర్ సింగ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఫేమ్ బేర్ గిల్స్ తో ‘రణ్‌వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గిల్స్’ బుల్లితెరపై రాబోతుంది.
ప్రస్తుతం రణ్ వీర్ తో నెట్ ఫ్లిక్స్ వెరైటీగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఒక మనిషి అడవుల్లో చిక్కుకుంటే జీవించి ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇందులో చూపించబోతున్నారు. రణ్ వీర్ అడవిలో ఎలా గడిపాడు అనేదాని గురించి నెట్ ఫ్లిక్స్ లో ఓ వీడియో విడుదల చేశారు. సూట్ వేసుకొని చాలా స్టైలిష్ గా ఉన్న రణ్ వీర్ కోసం ప్లేట్ లో ఓ పురుగును తీసుకు వస్తారు. దాన్ని చూడగానే రణ్ వీర్ ముఖంలో రక రకాల మార్పులు కనిపిస్తాయి.. ఎలాగో అలా ఆ పురుగుని తినేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రణ్ వీర్ సింగ్ పై రక రకాల కామెంట్లతో ఊదరగొడుతున్నారు. అది ఫేక్ అని కొంతమంది కామెంట్లు చేస్తే.. ఇలాంటి ఫీట్స్ ఈ హీరోకి అంత అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, బేర్‌గ్రిల్స్‌తో కలిసి రణ్ వీర్ చేసిన అడ్వెంచరస్ జర్నీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Ranveer Singh: ‘మ్యాన్ vs వైల్డ్’ బేర్ గ్రిల్స్ తో రన్వీర్ సింగ్ సాహసాలు.. ప్రోమో వైరల్!