‘నిజం నిలుచునే లోపల అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది’ అన్న సామెత చిత్ర పరిశ్రమకు కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో రూమర్లకు కొదవలేదు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఏదైన పోస్ట్ పెడితే చాలు దాని చుట్టూ ఎన్నో కథలు అల్లుతారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే హీరో దగ్గుబాటి రానా సతీమణి మిహికా ఓ పాపను ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు. దీంతో రానా దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయినట్లుగా వార్తలు సైతం వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించాడు హీరో రానా.
దగ్గుబాటి రానా.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, విలన్ గా తనదైన ముద్ర వేసుకున్నాడు. బాహుబలిలో తనదైన విలనిజం పండించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు అయిన మిహికా బజాజ్ ను 2021 ఆగష్టు 8 న వివాహం చేసుకున్నాడు రానా. అయితే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఆ వార్తలపై స్పందించాడు రానా. తాను తండ్రి కాబోతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. మిహిక ప్రెగ్నెంట్ కాదని రానా స్పష్టం చేశారు. ఇక ఈ దంపతులు సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా ఉండరు. ప్రస్తుతం రానా, వెంకటేష్ నటించిన రానా నాయుడు చిత్రం వెబ్ సిరీస్ గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు రానా మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.