టాలీవుడ్ లో మరో హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. సైలెంట్ గా ఆ ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు సడన్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసరికి ఫ్యాన్స్ షాకయ్యారు. నటీనటులతో పాటు నెటిజన్స్.. అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. యువ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న అతడు.. అడపాదడపా హిట్స్ కొడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
నాగశౌర్య.. 2011లో ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ సినిమాతో తెలుగులోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘దిక్కులు చూడకు రామయ్య’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ‘ఛలో’ నుంచి రూట్ మార్చి కామెడీ ఎంటర్ టైనర్స్ చేస్తూ వచ్చాడు. ఇప్పడు సడన్ గా పెళ్లి విషయం బయటకొచ్చింది. ఈనెల 20న బెంగళూరులో నాగశౌర్య పెళ్లి జరగనుంది. అనూషతో అతడు ఏడడుగులు వేయనున్నాడు. 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో.. ఇప్పటినుంచే నాగశౌర్య ఇంట్లో సందడి మొదలైపోయింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగశౌర్, తన 24వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న ఈ చిత్రం.. ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో గత చిత్రాల కంటే నాగశౌర్య డిఫరెంట్ గా కనిపిస్తాడని చిత్రబృందం ధీమాగా ఉంది. ఇక ఈ ఏడాది ‘కృష్ణవిృంద విహారి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇవే కాకుండా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.
Best wishes to @IamNagashaurya & Anusha for the wedding on Sunday, 20th November in Bangalore city. pic.twitter.com/6EFk16tW9D
— Aakashavaani (@TheAakashavaani) November 10, 2022