టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎంగేజ్‌మెంట్ అయ్యిందా? ఇప్పుడు ఇదే ఫోటో సోషల్ మీడియాల్ రచ్చ రచ్చ చేస్తోంది. కొద్దిమంది సమక్షంలో ఆయనకు కాబోయే భార్యతో నిశ్చితార్ధం జరిగినట్లు ఫోటో మాత్రం వైరల్ అయ్యింది. ఇక తాజాగా కార్తికేయ ఎంగేజ్‌డ్ అంటూ రాసి ఉన్న ఓ వాట్సప్ స్టేటస్‌లో ఈ ఫోటో తిరుగుతూ ఉంది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. ఇక ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఈ హీరో.
ఈ ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాను తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక కార్తికేయ ఈ మూవీ అనంతరం చావు కబురు చల్లగా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకొచ్చి కాస్త మెరిపించాడు. ఈ చిత్రం తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ జోరు మీదున్నాడు ఈ హీరో. కాగా కార్తికేయ ప్రస్తుతం అజిత్ వాలిమై సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ.. రాజా విక్రమార్క అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే తాజాగా హీరో కార్తిక్ ఎంగేజ్‌మెంట్‌కు గురుంచి ఎలాంటి అధికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది.